ఆ టీఆర్ఎస్ ఎంపీ ఎన్నిక చెల్లదు.. హైకోర్టులో పిటీషన్..!
By Medi Samrat Published on : 18 Oct 2019 2:03 PM IST

జహీరాబాద్ పార్లమెంట్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో పిటీషన్ దాఖలైంది. ఎన్నికల అఫిడవిట్‌లో తనఫైన ఉన్న క్రిమినల్ కేసులు పొందుపర్చలేదని.. ఎన్నికల కమిషన్ నిబంధనలను పాటించలేదని మదన్ మోహన్ రావు అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. ప్రతివాదులుగా జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఎన్నికల కమిషన్, టిఆర్ఎస్ పార్టీలకు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఆరు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.
Next Story