మహిళ ఆర్ఐపై దురుసుగా ప్రవర్తించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే .. వీడియో వైరల్

By సుభాష్  Published on  13 Jun 2020 2:13 PM GMT
మహిళ ఆర్ఐపై దురుసుగా ప్రవర్తించిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే .. వీడియో వైరల్

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ రౌడీలా వ్యవహారించారు. చెరువులను కబ్జా చేసేలా ప్రొత్సహిస్తున్నారని అరోపణలు ఎదుర్కొంటున్ననేపథ్యంలో.. అడ్డు తగిలిన రెవెన్యూ అధికారుల పై బూతులు తిడుతూ.. పేపర్స్ తో దాడికి పాల్పడ్డారు. దీంతో కూకట్ పల్లి ఏసిపికి ఫిర్యాదు చేశారు. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయాలని దళితనేతలు డిమాండ్ చేశాయి. శేరిలింగం పల్లి నియోజకవర్గంలో హైదర్‌ నగర్‌లోని కింది చెరువులో అభివృద్ది పేరుతో అడ్డంగా మట్టి నింపుతున్నారు. అక్రమంగా లారీలు తీసుకోచ్చి చెరువులో నేరుగా పొస్తున్నారని స్థానికులు తహసీల్దార్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో రెవెన్యూ సిబ్బందితో తహసీల్దార్‌ అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే అరకపూడి తో పాటు అనుచరులు జనార్ధన్, శ్రీను, రాజుయాదవ్, శ్రీకాంత్ దుర్బుచాలాడారు. కూకట్ పల్లిలోని కింద కుంటలో మట్టి నింపుతుండగా, అడ్డుతగిలిన దళిత మహిళ ఆర్‌ఐపై ఎమ్మెల్యే గాంధీ చేతిలో పట్టుకున్న పేపర్స్ తో చేయి చేసుకున్నారు. అంతేకాకుండా ఆర్ ఐపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో మరింత వివాదస్పదంగా మారింది.

గాంధీ కబ్జాలు ఒక్కటి కాదు రెండు కాదు.. గోకుల్ ప్లాట్స్ లాంటి ప్రాంతాల్లో తన వర్గానికి ఎలాంటి అనుమతులు లేకుండా 4 అంతస్తులు 5 అంతస్తులు నిర్మించుకునేలా చేస్తారని నియోజకవర్గ ప్రజలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అక్కడికి కనీసం అధికారులు అడుగుపెట్టే ధైర్యం చేయరని, ఎవరైనా దర్యాప్తు వెళ్లితే.. ముక్కుమ్మడి దాడి చేసి పంపిస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని దళిత సంఘాలు డిమాండ్‌ చేశాయి.

Next Story