'మిస్ మ్యాచ్' చిత్రంలోని 'అరెరే అరెరే' పాట‌ను రిలీజ్ చేసిన త్రివిక్రమ్

By అంజి  Published on  25 Nov 2019 10:02 AM GMT
మిస్ మ్యాచ్ చిత్రంలోని అరెరే అరెరే పాట‌ను రిలీజ్ చేసిన త్రివిక్రమ్

అధిరోహ్ క్రియేటివ్ సైన్స్ ఎల్.ఎల్.పి’ సంస్థ తమ తొలి ప్రయత్నంగా నిర్మిస్తున్న చిత్రం ‘మిస్ మ్యాచ్’. ఉదయ్ శంకర్ (ఆట గదరా శివ ఫేమ్) కథానాయకునిగా, ఐశ్వర్య రాజేష్ (కాకా ముత్తై, కన్నా తమిళ చిత్రాల నాయిక, దివంగత ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె) నాయికగా నటిస్తున్నారు. తమిళనాట హీరో విజయ్ ఆంటోని నటించగా ‘సలీం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని రూపొందించిన ఎన్ వి. నిర్మల్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనకిది తొలి తెలుగు చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న 'మిస్ మ్యాచ్' విడుదలకు సిద్ధమైంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ‘యు’ సర్టిఫికెట్ ను పొందిందీ ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 6 న ‘మిస్ మ్యాచ్’ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర నిర్మాతలు జి.శ్రీరామ్ రాజు, భరత్ రామ్ లు ఇటీవలే మీడియాకు అధికారికంగా ప్రకటించారు. కాగా ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని మొదటిపాట 'అరెరే అరెరే'ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేసారు.

ఈ సందర్బంగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ… 'మిస్ మ్యాచ్' టైటిల్ కొత్తగానూ, ఆసక్తిని కలిగించేదిగానూ ఉంది. డైరెక్టర్ నిర్మల్ తీసిన సలీమ్ సినిమా తమిళ్, తెలుగులో మంచి విజయం సాధించింది. తెలుగులో అతను ఫస్ట్ టైమ్ డైరెక్ట్ చేస్తున్న ‘మిస్ మ్యాచ్’ సినిమా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. చిత్ర యూనిట్ కు గుడ్ లక్. ‘మిస్ మ్యాచ్’ ఫ్యామిలీ అందరూ కలిసి చూడదగ్గ సినిమా అవుతుందని భావిస్తున్నాను. హీరో ఉదయ్ శంకర్ కు నటుడిగా మంచి భవిష్యత్ ఉంది. ఇప్పుడు రిలీజ్ అయిన ‘అరెరే అరెరే’ మెలోడీ సాంగ్, వినాలనిపించేదిగా ఉందన్నారు.

హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ…నా అభిమాన దర్శకుడు త్రివిక్రమ్ ‘మిస్ మ్యాచ్’ చిత్రంలోని ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం అందరికి నచ్చుతుందని భావిస్తున్న అన్నారు. మళ్ళీ ఈ సినిమా సాంగ్ ఆయన చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషంగా ఉంది. ఈ సినిమా కోసం అందరూ కష్టపడి పనిచేశారు. నిర్మాతలు సినిమాను ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు అన్నారు హీరో ఉదయ్ శంకర్.

మ్యూజిక్ డైరెక్టర్ గిఫ్టన్ ఇలియాస్ మాట్లాడుతూ…సినిమాలో అన్ని పాటలు బాగా వచ్చాయి. ‘అరెరే అరెరే’ సాంగ్ త్రివిక్రమ్ చేతుల మీదుగా విడుదలవ్వడం సంతోషం. శ్రేష్ఠ ఈ పాటను రచించారు, ఎమ్. ఎమ్. మనస్వి పాడడం జరిగింది. ఆడియన్స్ అందరికి ఈ సాంగ్ నచ్చుతుందని భావిస్తున్నాను” అన్నారు.

డైరెక్టర్ ఎన్. వి.నిర్మల్ మాట్లాడుతూ..'అరెరే అరెరే' పాట ఒక మెలోడీ సాంగ్. శ్రోతలకు నచ్చే సాంగ్ ఇది. గిఫ్టన్ కంపోజిషన్ లో మనస్వి చక్కగా పాడడం జరిగింది. త్రివిక్రమ్ ఈ సాంగ్ రిలీజ్ చెయ్యడంతో ఆడియన్స్ కు ఈ సాంగ్ మరింత చేరువవుతుందని భావిస్తున్నాను” అన్నారు.

Next Story
Share it