అభిమానుల‌కు త్రిష బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. 'నాతో డేటింగ్ చేయాలంటే..'

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 April 2020 7:02 PM IST
అభిమానుల‌కు త్రిష బంఫ‌ర్ ఆఫ‌ర్‌.. నాతో డేటింగ్ చేయాలంటే..

టాలీవుడ్‌లో 'వ‌ర్షం' సినిమాతో అడుగుపెట్టి.. 'నువ్వొస్తానంటే.. నేనొద‌ద్దాంటానా' చిత్రంతో యువ‌త హృద‌యాల‌ను కొల్ల‌గొట్టిన క‌థానాయిక త్రిష‌. ఇటు తెలుగుతో పాటు అటు త‌మిళంలోనూ రెండు ద‌శాబ్దాల పాటు త‌న హ‌వాను కొన‌సాగించింది. క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా షూటింగ్‌లు వాయిదా ప‌డ‌డంతో ప్ర‌స్తుతం ఇంటికే ప‌రిమితం అయ్యింది అమ్మ‌డు.

లాక్‌డౌన్ కాలంలో తాను చేసే ప‌నుల‌ను అభిమానుల‌తో సోష‌ల్ మీడియాలో పంచుకుంటుంది. ఇటీవ‌ల ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లోకి వ‌చ్చిన అమ్మ‌డు.. అభిమానుల‌కు ప్ర‌శ‌ల‌కు స‌మాధానం ఇచ్చింది. అంతేకాదండోయ్ అభిమానుల‌కు ఓ బంఫ‌ర్ ఆఫ‌ర్ కూడా ఇచ్చింది.

సినిమా ఇండ‌స్ట్రీలో ఉన్న‌ప్ప‌టికి 'నేను ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ్వ‌రితో డేటింగ్ చేయ‌లేదు. మీలో ఎవ‌రికైనా నాపై గ‌నుక ఇంట్రెస్ట్ ఉంటే.. నా స‌మ‌యాన్ని వృథా చేయ‌కుండా న‌న్ను ఎంత బాగా చూసుకుంటారో తెలియ‌జేస్తూ.. 500 ప‌దాల‌తో ఓ వ్యాసం రాసి ఇంప్రెస్ చేయండి. ఆ వ్యాసం గ‌నుక న‌న్ను ఇంప్రెస్ చేస్తే.. ఇక మీపంట పండిన‌ట్లేన‌ని' చెప్పింది త్రిష‌.

అంటే అమ్మ‌డిని క‌విత‌తో మెప్పించిన‌ వాడితో డేట్ కు వెళ్ల‌నుంద‌న్న మాట‌. అయితే.. కొంద‌రు మాత్రం త్రిష ఆఫ‌ర్ పై వ్యంగాస్ట్రాలు సంధిస్తున్నారు. లాక్‌డౌన్‌లో బోర్ కొట్ట‌డంతో ఏం చేయాలో తెలియక ఇలా చేసింద‌ని అంటున్నారు. అయితే.. ఆ మ‌ధ్య త్రిష‌కు చెన్నైకి చెందిన ఓ బిజినెస్‌మెన్‌తో ఎంగేజ్‌మెంట్ జ‌రిగింది, కానీ అది పెళ్లి వ‌ర‌కు వెళ్ల‌లేదు. అంత‌ముందు ఓ టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ చేసిన‌ట్లు వార్త‌లు వినిపించాయ‌నుకోండి అది వేరే సంగ‌తి. 36 ఏళ్ల వ‌య‌సులో త్రిష‌కు పెళ్లిపై గాలి మ‌ళ్లిందంటున్నారు నెటీజ‌న్లు.

Next Story