లక్కీ ఓం క్రియేషన్స్ సమర్పణలో ఎల్ ఓ ఎల్ ఎంటర్ టైన్మెంట్ పతాకం పై  మున్నా హీరోగా నిర్మిస్తున్న చిత్రం “ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ” . ఈ చిత్రం పాటల రికార్డింగ్ నేడు హైదరాబాద్ లో ప్రారంభమైనది. మొదటి పాటను కీరవాణి తనయుడు కాలబైరావ పాడిన పాటతో ,పూజాకార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు లక్ష్మణ్ జెల్లా మాట్లాడుతూ…

“ఫ్రెండ్ షీప్ ను కొత్తకోణం లో చూపే యూత్ ఫుల్ సబ్జెక్ట్  మా చిత్రం. మంచి ఎమోషన్స్ ఉన్న యాక్షన్ ఎంటర్ టైనర్ మాచిత్రం డిఫనెట్ గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో రాబోతుంది’ అని అన్నారు. మొదటి షెడ్యూల్  డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభంవుతుందని నిర్మాత చండ్ర చంద్రశేఖర్ తెలిపారు.

అయితే గోదావరిఖని, గోవా, సింగపూర్, థాయిలాండ్, లలో షూటింగ్ జరగనుంది అని మరో నిర్మాత  రావి రామ్మోహనరావు తెలిపారు. ఈ చిత్రానికి రచన:D. కృపాకర్, కాస్టూమ్ డిజైనర్:రోజి విలియం, డి.ఓ. పి:రాహుల్ మాచినేని, సంగీతం:శ్రవణ్ భరద్వాజ్, ఫైట్స్:దేవరాజ్, నిర్మాతలు:చండ్ర చంద్ర శేఖర్, రావి రామ్మోహన్, జెజీ యమ్ లోకేష్ కుమార్, ఎం కె మూర్తి, కధ, స్క్రీన్ ప్లే దర్శకత్వం:లక్ష్మణ్  జెల్లా.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

2 comments on " “ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడు ”  సాంగ్స్ రికార్డింగ్ ప్రారంభం"

Comments are closed.