దడ పుట్టిస్తున్న డెంగ్యూ.. స్థలం సరిపోక చెట్ల కింద చికిత్స

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Oct 2019 6:14 AM GMT
దడ పుట్టిస్తున్న డెంగ్యూ.. స్థలం సరిపోక చెట్ల కింద చికిత్స

వికారాబాద్‌ జిల్లాలో డెంగ్యూ విజృంభిస్తోంది. రోగులు ఆస్పత్రులకు క్యూ కడుతున్నారు. పట్టణంలోని ఓ ప్రైవేటు క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో డెంగ్యూ రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. దీంతో ఆస్పత్రి యాజమాన్యం చేసేదిలేక.. స్థలం సరిపోక చెట్ల కింద ఆరుబయట గొడుగులను ఏర్పాటుచేసి రోగులకు చికిత్సను అందిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాసుపత్రిలో సరైన చికిత్స చేసి ప్రజల ఆరోగ్యం విషయంలో తగు చర్య తీసుకోవాలని మిషన్ డాక్టర్ అవినాష్ తెలిపారు. రోగుల సంఖ్య పెరగడంతో మా దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఏదో విధంగా మా ప్రయత్నంగా చికిత్స చేస్తున్నాం. స్థలం సరిపోకపోవడంతో గొడుగులను ఏర్పాటుచేసి ప్రత్యేకమైన మంచాలు ఏర్పాటు చేసి చికిత్స నిర్వహిస్తున్నామన్నారు.

మంచిర్యాల జిల్లాల్లో డెంగ్యూ దెబ్బకు కుటుంబాలు కుదేలవుతున్నాయి. ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మృత్యువాత పడ్డారు. ఈ ఘటన స్థానికంగా ప్రజలను కలిచివేస్తుంది. అయితే 15 రోజుల్లోనే ఒకే కుటుంబంలో నలుగురు డెంగ్యూ బారిన పడి మృతి చెందడంతో.. కుటుంబ సభ్యులు, బందువులు శోకసంద్రంలో మునిగి పోయారు.

Next Story
Share it