చిత్తూరు జిల్లాలో నరబలి కలకలం రేగింది. గుప్త నిధుల కోసం ఓ వ్యక్తిని బలిచ్చేందుకు కొందరు దుండగులు ప్రయత్నించారు. సజీవ దహనం చేసేందుకు యత్నించగా అతడు గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రికిలో చికిత్స పొందుతున్నాడు.

గుప్త నిధుల తవ్వకం కోసం చిత్తూరు జిల్లా దొడ్డిపల్లి అటవీ ప్రాంతానికి ఏడుగురు వెళ్లారు. వారిలో గణేష్ కూడా ఉన్నాడు. కొంత దూరం వెళ్లాక స్వామీజీతో పూజలు చేపించిన అనంతరం గణేష్‌ను సజీవ దహనం చేసేందుకు ప్రయత్నించారు. అది విఫలం అవ్వడంతో గణేష్ పై యాసిడ్‌ దాడి చేశారు. వారి బారి నుంచి ఎలాగోలా తప్పించుకున్నాడు బాధితుడు. ప్రస్తుతం రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా.. ఈ ఘటన పై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Newsmeter.Network

Next Story