గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..? వైద్యులు ఏమంటున్నారు

By సుభాష్  Published on  6 Oct 2020 8:30 PM IST
గర్భిణులు ప్రయాణాలు చేయవచ్చా..? వైద్యులు ఏమంటున్నారు

ఇంట్లో ఉన్న మహిళ గర్భం దాల్చిందంటే చాలా ఇంట్లో ఉన్న అందరికి ఆనందమే. గర్భం దాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొకుండా 9 నెలల పాటు 9 నెలల వరకు అన్నిజాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గర్భవతిగా సమయంలో చాలా మందికి ఎన్నో అనుమానాలు, అపోహాలు వస్తుంటాయి. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంటుంది. గర్భిణీగా ఉన్న సమయంలో వైద్యుల సలహాలు పాటించాల్సి ఉంటుంది. 9 నెలల వరకు ప్రతి నెల స్త్రీ వైద్య నిపుణుల సలహాలు, సూచనలు పాటించాలి. అంతేకాకుండా గర్భం దాల్చిననాటి నుంచి డెలివరీ అయ్యే వరకు ఎలంటి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచిస్తున్నారు.

ఐదు నెలల తర్వాత ఎలాంటి పరిస్థితుల్లోనూ..

గర్భం దాల్చిన ప్రతి మహిళ దాదాపు ఐదునెలల వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రయాణాలు చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఆ తర్వాత ప్రయాణాలు ఖచ్చితమైతే తప్ప వెళ్లకూడదంటున్నారు. అలాగే 8 నెలల నుంచి బిడ్డ పుట్టే వరకు విశ్రాంతి తీసుకోవడమే ఉత్తమం. ఇక ఇప్పుడున్న ఆహారపు అలవాట్లు, వాతావరణం వల్ల చాలా మందికి ప్రెగ్నిన్సీ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇప్పుడున్న కాలంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకప్పుడు మంచి బలమైన ఆహారం తీసుకోవడం వల్ల గర్భిణులు వ్యవసాయం పనులు, ఇతర ఏవైనా పనులు చేసినా ఎలాంటి సమస్య వచ్చేది కాదు. ఇప్పుడున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో సమస్యలు దరి చేరుతున్నాయి. అందుకు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అలాగే ఎక్కడికైన ఖచ్చితంగా ప్రయాణం చేయాల్సి వస్తే మెడికల్‌ రిపోర్టులు సైతం వెంట ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఒక వేళ తలనొప్పి, కడుపులో వికారం, నడుము నొప్పి, ఇతర సమస్యలేవైనా ఉంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రయాణం చేయకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సలహాలు ఇస్తున్నారు. గర్బిణీగా ఉన్న సమయంలో తీసుకునే ఆహారం, వాతావరణం వల్ల బట్టి పుట్టబోయే బిడ్డపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందంటున్నారు.

Next Story