కరోనా సంక్షోభం.. రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్‌ బెడ్స్

By అంజి
Published on : 31 March 2020 8:11 PM IST

కరోనా సంక్షోభం.. రైలు బోగీల్లో 3,20,000 ఐసోలేషన్‌ బెడ్స్

మహమ్మారి కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు ప్రారంభించింది. కరోనా బాధితులకు ఆస్పత్రుల్లో బెడ్లు సరిపోని పరిస్థితి తలెత్తితే.. రైళ్లనే ఆస్పత్రులుగా వాడాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రైల్వే శాఖ ఏర్పాట్లను ముమ్మరం చేసింది.

Train coach into isolation ward

20 వేల కోచ్‌లను ఐసోలేషన్‌ కేంద్రాలుగా మార్చాలని తాజాగా రైల్వే శాఖ నిర్ణయించింది. ఇండియన్‌ రైల్వేకు చెందిన ఐదు జోన్లు నాన్‌ ఏసీ రైలు కోచ్‌లను ఆస్పత్రిగా మార్చి నమునాలను తయారు చేసింది. ఒక కోచ్‌లో 165 మందికి చికిత్స అందించేలా రూపొందించిన డిజైన్‌ సక్సెస్‌ కావడంతో మరిన్ని కోచ్‌లను ఆస్పత్రులుగా మార్చేందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

Train coach into isolation ward

3.2 లక్షల ఐసోలేషన్‌ బెడ్స్‌ ఏర్పాటు చేయడంతో పాటు కోచ్‌ల్లో వైరస్‌ నివారణ చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇప్పటికే ఐదు వేల కోచ్‌ల్లో 80 వేల పడకలను అధికారులు సిద్ధం చేశారు.

ఏకంగా 20,000 కోచ్‌లను మాడిఫై చేసి 3,20,000 ఐసోలేషన్ బెడ్స్‌ని అందుబాటులోకి తీసుకొస్తామని భారతీయ రైల్వే అధికారికంగా ప్రకటించింది. అత్యధిక కోచ్‌లు తెలంగాణకు అందుబాటులోకి రానున్నాయి. వీటిని క్వారెంటైన్, ఐసోలేషన్ వార్డులుగా వాడుకోవచ్చు.

Train coach into isolation ward

సికింద్రాబాద్‌ దక్షిణ మధ్య రైల్వే కేంద్రంగా 486 కోచ్‌ల్లో 7,776 ఐసోలేషన్‌ బెడ్లు ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ప్రతీ నాన్‌ ఏసీ కోచ్‌లో 9 కంపార్ట్‌మెంట్స్‌, నాలుగు టాయిలెట్స్‌ ఉంటాయి. కోచ్‌లోనే ప్రత్యేకంగా పేషంట్లకు, మెడికల్‌ సిబ్బందికి వేర్వేరు క్యాబిన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Next Story