ఉస్మానియా ఆసుపత్రిలోకి నీళ్లు రావటం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గుతో తలదించుకోవాలన్నారు. ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా టెస్టులు ఎక్కువ చేస్తే పాజిటివ్ కేసులు ఎక్కువ వస్తాయని.. అందువల్లే టెస్టులు తక్కువ చేస్తున్నారని కేసీఆర్‌పై మండిపడ్డారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.