సీసాలో చిత్రాలు.. మ‌డుపు శ్రీనివాస్‌ ప్రతిభకు నిదర్శనం..!

By అంజి  Published on  21 Dec 2019 10:32 AM GMT
సీసాలో చిత్రాలు.. మ‌డుపు శ్రీనివాస్‌ ప్రతిభకు నిదర్శనం..!

అత‌నొక మారుమూల గ్రామంలో జ‌న్మించిన సాధార‌ణ వ్య‌క్తి. వృత్తి రీత్యా వండ్రంగి పని చేసే మ‌డుపు శ్రీనివాస్ కు చిన్న‌ప్ప‌టి నుంచి ఆట బొమ్మ‌ల‌ను క‌ర్ర‌తో త‌యారు చేసే అలావాటు ఉంది. క‌రీనంగ‌ర్ జిల్లా చొప్ప‌దండి మండ‌లం చిట్యాల‌ప‌ల్లి గ్రామానికి చెందిన మడుపు రామలింగం సత్తమ్మల‌ కుమారుడు శ్రీనివాస్ చారి. తనకు యుక్త వయస్సు వచ్చేసారికి కుటుంబనికి పెద్ద దిక్కు గా ఉన్న తండ్రి అనారోగ్యంతో మృతి చెందడంతో ఆర్ధిక భారం శ్రీనివాస్ మీదపడింది. అప్పటి వరకు జీవితంలో ఏదో ఒకటి సాధించాలన్న కోరిక అతని కలగా మాత్రమే మారిపోయింది. తాను ఖాళీగా ఉన్న సమయంలో ఏదో ఒక వింత నైపుణ్యం గల ఆట వస్తువులను తయారు చేస్తూ గ్రామస్థులందరిని అబ్బురపరిచేవాడు. త‌న‌కున్న ప్ర‌తిభ‌తో ఇప్పటి వరకు తను చేసిన వాటిలో కొన్నిఖాళీ అయిన మద్యం సీసాల్లో పొందుప‌ర్చాడు. ఇల్లు, ఫ‌ర్నీచ‌ర్, బెడ్ మంచం, గుడి, తాబేలు లాంటివే కాకుండా ఎలాంటి జెంట్ లేకుండా కర్రతో గొలుసును కూడా తయారు చేశాడు.

శ్రీనివాస్ మాట్లాడుతూ......

ఒక సీసాలో ఒక బోమ్మ తయారు చేయడానికి కనీసం వారం రోజులు పట్టింది. నా కంటూ సమాజంలో ఓ ప్రత్యేక గుర్తింపు ఉండాలన్న ఆలోచనతోనే నేను ఈ ప్రత్యేకమైన బొమ్మలను తయారు చేస్తున్నాను. నేను ఇన్ని తయారు చేసిన తగిన గుర్తింపు లేకపోవడంతో ఇన్ని రోజుల వెలుగులోకి రాలేకపోయాను. ప్రస్తుతం గ్రామాల్లో వడ్రంగి పనికి ఉపాధి లేకపోవడంతో డ్రైవింగ్ చేస్తున్నాను. వడ్రంగి కులవృత్తి పడిపోవడంతో రోజు గడవడం కష్టమవుతోందని.. ప్రభుత్వం నా ప్రతిభను గుర్తించి నాకు ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాను. నా నైపుణ్యాన్ని గుర్తిస్తే భవిష్యత్తు లో మరిన్ని అద్భుతమైన వాటిని తయారు చేయడంలో ముందుతుంటాను. అని శ్రీనివాస్ అంటున్నాడు.

Toys in the bottle

Toys in the bottle Toys in the bottle Toys in the bottle Toys in the bottle

Next Story