ఈటానగర్: రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి వినూత్న ప్రయోగం చేశారు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖండు. తనే స్వయంగా బైక్ పై ఒంటరిగా 122 కిలోమీటర్లు ప్రయాణం చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు. అరుణాచల్ ప్రదేశ్‌లో అందమైన పర్యాటక ప్రాంతాలు చాలా ఉన్నాయి. పాసీఘాట్ అనే ప్రాంతం బైక్ రైడింగ్, సాహస క్రీడలకు ప్రసిద్ధి . ఈ ప్రాంతాన్ని పర్యాటకులకు మరింత చేరువ చేసేందుకు పేమఖండూ స్వయంగా బైక్‌ నడుపుతూ ఆ ప్రాంతానికి వెళ్లారు.

Image result for ARUNACHAL CM BIKE

ఇలాంటి సాహసకృత్యాలు చేయడం పెమాఖండూకు కొత్తేం కాదు. గతంలో కూడా ఇలా చాలా సార్లు బైక్ రైడింగ్ చేశారు. గత నవంబర్‌ లో సల్మాన్ , కేంద్ర మంత్రితో కలిసి సైక్లింగ్ చేశారు.

Image result for ARUNACHAL CM BIKE

ఏ ముఖ్యమంత్రి అయినా తమ రాష్ట్రం పర్యాటకంగా అభివృద్ధి చెందాలి అంటే కొత్త రకాల పథకాలు చేపడతారు. పర్యాటకుల కోసం కొత్త కొత్త అవకాశాలు కల్పిస్తారు. కాని.. ఒక సామాన్య పర్యాటకుడిలాగా బైక్ రైడింగ్‌ , సాహసకృత్యాలు చేస్తున్న పెమాఖండ్‌ను చూసి నెటిజనులు వావ్ అంటున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.