ఆస్ట్రేలియాలో ఆ పని చేస్తే రూ.5 లక్షల జరిమానా

By సుభాష్  Published on  29 Jan 2020 12:37 PM GMT
ఆస్ట్రేలియాలో ఆ పని చేస్తే రూ.5 లక్షల జరిమానా

ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా అడవులు, జంతువులు అగ్నికి ఆహుతవుతున్నాయి. ఇటీవల వర్షాలు కురియడంతో కొంత వరకు మేలు జరిగినా.. పరిస్థితి మళ్లీ యథాస్థితికి వచ్చింది. దీంతో ఆస్ట్రేలియా సర్కార్‌ మంటలను అదుపు చేయడం కోసం అనేక చర్యలు చేపడుతున్నా..అది పూర్తి స్థాయిలో సాధ్యం కావడం లేదు. ఈ నేపథ్యంలో కారులో వెళ్తూ సిగరేట్‌ను ఆర్పకుండా ఎవరైనా రోడ్డుపై పడేస్తే వారికి ఐదు జరిమానా విధించనున్నారు.

Total Fire Ban

కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలోని అనేక ప్రాంతాల్లో 'టోటల్‌ ఫైర్‌ బ్యాన్‌' అమలు చేస్తాంది. బహిరంగ ప్రాంతాల్లో ఏ ఒక్కరు కూడా నిప్పుకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు చేపట్టకూడదంటూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇక 'టోటల్‌ ఫైర్‌ బ్యాన్‌' అమలులో భాగంగా సిగరెట్‌ ఆర్పివేయకుండా రోడ్డుపై పడేస్తే వారికి 11 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (రూ.5 లక్షల 37వేలు) జరిమానా విధించనున్నారు. అలాగే డీమెరిట్‌ పాయింట్లను సైతం ఐదు నుంచి పదికి పెంచనున్నట్లు న్యూ సౌత్‌ వేల్స్‌ అధికారులు స్పష్టం చేశారు. అయితే ఈ విధానం జనవరి 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. అలాగే ఎవరైన సిగరెట్‌ ఆర్పకుండా రోడ్డుపై పడేస్తే 1800679739 నెంబర్‌కు ఫోన్‌ చేసి సమాచారం అందించాలని రూరల్‌ ఫైర్‌ సర్వీస్‌ అధికారులు కోరుతున్నారు.

Next Story