చంద్రబాబుని కలిసిన షర్మిల.. ఆసక్తికర కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబుని కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు.

By Srikanth Gundamalla  Published on  13 Jan 2024 7:15 AM GMT
ys sharmila,  chandrababu, tdp,  invite, rajareddy marriage,

చంద్రబాబుని కలిసిన షర్మిల.. ఆసక్తికర కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబుని కాంగ్రెస్‌ నాయకురాలు వైఎస్ షర్మిల కలిశారు. హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో సమావేశమైన షర్మిల.. తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని చంద్రబాబుని ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు ప్రముఖులను ఆహ్వానించిన షర్మిల తాజాగా చంద్రబాబుని కూడా కలిసి వివాహ వేడుకకు రావాలని కోరింది. ఈ మేరకు వివాహ ఆహ్వాన పత్రికనూ అందజేసింది. వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత చంద్రబాబుని తొలిసారిగా కలివారు.

ఈ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన షర్మిలకు చంద్రబాబు దంపతులు సాదరంగా ఆహ్వానం పలికారు. ఏపీలో ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తుతో ఎన్నికలకు వెళ్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ కూడా వీరితో చేతులు కలిపే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. రానున్న ఎన్నికల నేపథ్యంలో షర్మిల, చంద్రబాబు మధ్య ఎలాంటి చర్చలు జరిగాయనేది ఆసక్తిగా మారింది. అయితే.. ఈ సమావేశం అనంతరం షర్మిల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.

వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మనవడు రాజారెడ్డి పెళ్లి తరుణంలో చాలా మందికి రాజకీయ నేతలను ఆహ్వానిస్తున్నామని షర్మిల చెప్పారు. అందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుని కూడా ఆహ్వానం పలకాలని వచ్చినట్లు చెప్పారు. అయితే.. పెళ్లికి వచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్లు చెప్పారు. చంద్రబాబు చాలా సేపు వైఎస్సార్‌ గురించి.. వారి స్నేహం, వారి రాజకీయ ప్రారంభ దశలో జరిగిన ప్రస్థానం గురించి గుర్తు చేశారని అన్నారు. ఇద్దరం ఇదే విషయం గురించి చాలా సేపు మాట్లాడుకున్నట్లు షర్మిల చెప్పారు. తనకు ఎంతో సంతోషంగా అనింపించిందన్నారు. అయితే.. రాజారెడ్డి వివాహ వేడుకకు వస్తానని చంద్రబాబు మాటిచ్చినట్లు షర్మిల చెప్పారు.

చంద్రబాబుని కలవడాన్ని ఎవరూ రాజకీయంగా చూడొద్దని షర్మిల కోరారు. రాజశేఖర్‌రెడ్డి కూడా తన సొంత పిల్లల పెళ్లిళ్లకు చంద్రబాబుని పిలిచారు. చంద్రబాబు కూడా అప్పట్లో వచ్చి ఆశీర్వదించారని గుర్తు చేశారు. అందరం ప్రజా సేవ చేయడానికే ఉన్ఆనమనీ.. అందరూ ఫ్రెండ్లీగా ఉండాలని చెప్పారు. ప్రజల కోసం నమ్మకంగా పనిచేద్దామన్నారు. అయితే.. కాంగ్రెస్‌ నాయకత్వం తనకు ఏ పదవి ఇచ్చినా స్వీకరిస్తాననీ.. ఆ నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని వైఎస్ షర్మిల అన్నారు.


Next Story