హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్‌

తాజాగా విరాట్‌ కోహ్లీ తన రెస్టారెంట్‌ మరో బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో కూడా ప్రారంభిస్తున్నారు.

By Srikanth Gundamalla  Published on  24 May 2024 10:35 AM GMT
virat kohli, new restuarent,  hyderabad ,

హైదరాబాద్‌లో విరాట్ కోహ్లీ 'వన్8 కమ్యూన్' రెస్టారెంట్‌

భారత స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ గురించి అందరికీ తెలిసిందే. రన్‌ మెషీన్‌గా పేరు సంపాదించుకున్న ఆయన.. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. క్రికెట్‌లో చాలా రికార్డులను బ్రేక్‌ చేశారు. అయితే.. క్రికెట్‌లో మాత్రమే కాదు.. విరాట్‌ కోహ్లీ వ్యాపార రంగంలో కూడా దూసుకెళ్తున్నారు. ఇప్పటి వరకు దుస్తులు, రెస్టారెంట్ల బిజినెస్‌లను విరాట్ కోహ్లీ ప్రారంభించారు. ఇక ముఖ్యంగా రెస్టారెంట్లను విరాట్‌ కోహ్లీ 'వన్ 8 కమ్యూన్' పేరుతో నిర్వహిస్తున్నాడు. వీటికి సంబంధించి బెంగళూరు, ముంబై, పుణె, కోల్‌కతా, ఢిల్లీ నగరాల్లో ఈ రెస్టారెంట్లను విరాట్‌ కోహ్లీ ఏర్పాటు చేశాడు.

ఇక తాజాగా విరాట్‌ కోహ్లీ తన రెస్టారెంట్‌ మరో బ్రాంచ్‌ను హైదరాబాద్‌లో కూడా ప్రారంభిస్తున్నారు. హైటెక్‌ సిటీలోని హార్డ్‌ రాక్‌ కేఫ్‌కు సమీపంలో ఉన్న నాలెడ్జ్‌ సిటీలో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో స్టోరీ పెట్టారు. ఈ మేరకు పోస్టు పెట్టిన ఆయన పలు విషయాలను షేర్‌ చేసుకోవడానికి ముందు రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్ హైటెక్‌ సిటీ నడిబొడ్డుకు వచ్చేశామని చెప్పార. తనకు.. వన్8 కమ్యూన్‌ అనేది కేవలం రెస్టారెంట్‌ మాత్రమే కాదని అన్నారు. హైదరాబాద్‌లోని ప్రజలను ఒకే చోటుకు చేర్చడమే తన ఉద్దేశమని విరాట్‌ కోహ్లీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తన రెస్టారెంట్‌కి అందరూ రావాలని ఆహ్వానించారు.

కాగా.. ఈ వన్‌8 కమ్యూన్ రెస్టారెంట్‌లో దేశీ వంటకాలతో పాటు విదేశీ వంటకాలను కూడా ఉంటాయి. ఎవరైనా విరాట్‌ కోహ్లీ రెస్టారెంట్‌ను సందర్శించాలి.. అందులో ఫుడ్‌ టేస్ట్‌ చేయాలనుకుంటే ముందుగానే రిజర్వేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ మేరకు ఫోన్‌ నెంబర్ల ద్వారా రిజర్వేషన్ చేసుకోవచ్చని విరాట్ చెప్పారు. 9559071818, 9559081818 అంటూ ఫోన్ నెంబర్లను కూడా కోహ్లీ పేర్కొన్నాడు.

Next Story