గణనాథుడికి బంగారంతో లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..!

విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని బంగారంతో తయారు చేశారు. ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే.

By Srikanth Gundamalla  Published on  23 Sep 2023 4:34 AM GMT
Vinayaka chavithi, Hyderabad, narayanguda, gold Laddu,

గణనాథుడికి బంగారంతో లడ్డూ.. మన హైదరాబాద్‌లోనే..!

వినాయక చవితి వచ్చిందంటే చాలు ప్రతి గ్రామంలో వాడవాడలా సంబరాలు అంబరాన్నంటుతాయి. రాత్రళ్లు పూజలు.. భజనలతో సందడిగా ఉంటుంది. వినాయకుడి కోసం ప్రత్యేక మండపాలు కడతారు. చుట్టుపక్కల వారంతా వచ్చి ఒకే చోట చేరి ఆడిపాడతారు. అయితే.. కొందరు అందరిలోకెల్లా తమ వినాయకుడు కాస్త భిన్నంగా ఉండాలనుకు కొత్తకొత్త ఆలోచనలతో భిన్నంగా ఏర్పాట్లు చేస్తుంటారు. వినాయకుడి విగ్రహాన్ని భారీగా నిలబెట్టడం.. వివిధ రూపాల్లో ఉన్న విగ్రహాలను కొనుగోలు చేయడం.. మండపాన్ని కొత్త డిజైన్లతో ఏర్పాటు చేయడం ఇలాంటివి చేస్తుంటారు. అయితే.. గణనాథుడి లడ్డూకి కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. ఈ క్రమంలో విఘ్నేశ్వరుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని బంగారంతో తయారు చేశారు. ఎక్కడో కాదండోయ్‌ మన హైదరాబాద్‌లోనే.

హైదరాబాద్‌లోని నారాయణగూడ స్ట్రీట్‌ నెంబర్‌-5లో వినాయక చవితి సందర్భంగా నిలబెట్టిన గణనాథుడి చేతిలో ప్రత్యేకంగా తయారు చేసిన బంగారం లడ్డూని ఉంచారు. జై శ్రీ గణేశ్‌ ఫ్రెండ్స్‌ యూత్‌ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. నిర్వహకులు చేయించిన తులం బంగారంతో చేసిన లడ్డూ ప్రత్యేక ఆకర్షణా నిలుస్తోంది. అయితే.. గత 24 ఏళ్లుగా విగ్రహాన్ని పెడుతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. గణనాథుడి నిమజ్జనానికి ముందు 15 కిలోల లడ్డూతో కలిసి బంగారం లడ్డూని కూడా వేలం నిర్వహిస్తామని వెల్లడించారు. అయితే.. బంగారంతో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ లడ్డూ గురించి తెలుసుకున్న స్థానికులు.. దాన్ని చూసేందుకు క్యూ కడుతున్నారు. అంతేకాదు.. నవరాత్రుల పాటు పూజలు అందుకునే లడ్డూకి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. లడ్డూని కొనుగోలు చేసేందుకు ఎంత ధర అయినా వెనక్కి తగ్గరు కొందరు భక్తులు. మరి ఇలా వినాయకుడి వద్ద పూజలు అందుకున్న బంగారంతో కూడిన లడ్డూ కూడా వస్తుందంటే వేలం ఏ మేరకు పలుకుతుందో అని స్థానికులు మాట్లాడుకుంటున్నారు.

Next Story