ప్రేమికుల్లారా.. ఈరోజు జాగ్రత్త!!
నేడు వాలెంటైన్స్ డే. ఈరోజున తాము ప్రేమించే వారిని కలుసుకుంటూ ఉంటారు.
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 14 Feb 2024 10:45 AM ISTప్రేమికుల్లారా.. ఈరోజు జాగ్రత్త!!
నేడు వాలెంటైన్స్ డే. ఈరోజున తాము ప్రేమించే వారిని కలుసుకుంటూ ఉంటారు. పలు ప్రాంతాల్లో జంటలే కనిపిస్తారు. ప్రేమికుల దినోత్సవం.. విదేశీ సంస్కృతి అని.. దాన్ని భారతదేశంలోకి తీసుకుని వస్తే ఏ మాత్రం ఒప్పుకోవద్దని అంటున్నాయి హిందూ సంఘాలు. ఇక ప్రేమికుల దినోత్సవాన్ని నిర్వహించడానికి వీల్లేదని హిందూ సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఎక్కడైనా జంటలు కనిపిస్తే పెళ్లిళ్లు చేస్తామని.. నకిలీ ప్రేమను ప్రోత్సహించే వాలెంటైన్స్ డే ను అడ్డుకొని తీరుతామని విశ్వహిందూ పరిషత్ , బజరంగ్ దళ్ హెచ్చరించింది. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రేమికుల రోజును అడ్డుకుంటామని.. పార్కులు, హోటళ్లు, విహార స్థలాలు రకరకాల ప్రదేశాల్లో సంచరించే కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. పెళ్లి చేస్తామని హెచ్చరిస్తున్నారు.
భారత యువత ప్రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించకూడదని అన్నారు. విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పోరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు సూచించారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని.. ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని బజరంగ్ దళ్ కార్యకర్తలు సూచించారు. 2019, ఫిబ్రవరి 14 న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని బజరంగ్ దళ్ నేతలు చెప్పారు.