సివిల్స్ 2021 తుది ఫలితాల విడుదల

By -  Nellutla Kavitha |  Published on  30 May 2022 8:41 AM GMT
సివిల్స్ 2021 తుది ఫలితాల విడుదల

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన సివిల్స్ 2021 ఫలితాలు విడుదలయ్యాయి. ఇందులో మొదటి మూడు స్థానాలు మహిళలే సాధించారు. టాపర్ గా శృతి శర్మ నిలిచింది, ఇక రెండో స్థానంలో అంకితా అగర్వాల్ నిలవగా, మూడో టాపర్గా గామిని సింగ్లా నిలిచారు. ప్రిలిమ్స్, మెయిన్స్ ఇంటర్వ్యూ రౌండ్ల తర్వాత తుది ఫలితం ఈ రోజు విడుదలైంది. సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష ఫలితాలు మార్చి 17న విడుదలయ్యాయి. మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి ఇంటర్వ్యూలు ఏప్రిల్ 5 నుంచి మే 26 వరకూ జరిగాయి. మెయిన్స్, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఫలితాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవాళ విడుదల చేసింది. మొత్తం 712 సివిల్ సర్వీసెస్ పోస్టుల కోసం ఈ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ఇందులో 22 దివ్యాంగుల కోసం కేటాయించారు.

మరోవైపు తెలుగువారు కూడా ఈసారి మంచి ర్యాంకులు సాధించారు. యశ్వంత్‌కుమార్‌రెడ్డి - 15వ ర్యాంక్, పూసపాటి సాహిత్య - 24వ ర్యాంక్, కొప్పిశెట్టి కిరణ్మయి - 56వ ర్యాంక్, సుధీర్‌కుమార్‌రెడ్డి - 69వ ర్యాంక్, ఆకునూరి నరేష్‌ - 117వ ర్యాంక్, బి.చైతన్యరెడ్డి - ౧౬౧వ ర్యాంక్, కమలేశ్వర్‌రావు - 297వ ర్యాంక్, నల్లమోతు బాలకృష్ణ - 420వ ర్యాంక్ సాధించారు.

Next Story