యూజీసీ నెట్‌-2024 పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ

జూన్ 18వ తేదీన నిర్వహించిన యూజీసీ నెట్‌ -2024 పరీక్షలను రద్దు చేసింది ఎన్టీఏ.

By Srikanth Gundamalla  Published on  20 Jun 2024 1:31 AM GMT
UGC NET-2024, Exam cancelled, central govt ,

యూజీసీ నెట్‌-2024 పరీక్షను రద్దు చేసిన ఎన్టీఏ 

ఒక వైపు దేశ వ్యాప్తంగా నీట్‌ పరీక్ష సంచలనంగా మారింది. అవకతవకలు జరిగాయాంటూ ఆరోపణలు ఉన్నాయి. జూన్ 18వ తేదీన నిర్వహించిన యూజీసీ నెట్‌ -2024 పరీక్షలను రద్దు చేసింది ఎన్టీఏ. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్‌షిప్‌, జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాల కోసం జరిగే పరీక్షను మళ్లీ నిర్వహించనుంది. యూజీసీ నెట్‌ పరీక్షలో అవకతవకలు జరిగాయని యూజీసీ నిర్ధారణకు వచ్చింది. దాంతో..ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకుంది.

పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యాశాఖ వివరణ ఇచ్చింది. ఈమేరకు ఎక్స్‌ వేదికగా ఒక పోస్టు పెట్టింది. ఈ పరీక్షలో అవకతవకలపై విచారణ జరిపించాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నామని కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. కాగా.. జూన్ 12న మంగళవారం దేశవ్యాప్తంగా 1205 సెంటర్లలో ఈ పరీక్ష నిర్వహించారు. దాదాపు ఈ పరీక్షకు 9 లక్షల మంది అభ్యర్థులు హాజరుఅయ్యారు.

ఇక మెడికల్‌ ఎంట్రెన్స్‌ టెస్టు నీట్‌ పేపర్‌ లీకేజీపైనా కేంద్రం స్పందించింది. సమయం కోల్పోయిన విద్యార్థులకు కలిపిన గ్రేస్‌ మార్కులను ఇటీవల రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. పట్నాలో నీట్‌ అవకతవకలపై పోలీసులు విచారణ జరుపుతున్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక ప్రాథమిక ఆధారాల మేరకు నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని నిర్ధారణకు వచ్చినట్లు చెప్పింది. ఇక ఈ విషయంలో బీహార్ ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని కేంద్ర విద్యాశాఖ చెప్పింది.

Next Story