కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు, పోటెత్తిన వరద

కర్ణాటకలో ప్రమాదం చోటుచేసుకుంది. హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌లో 19వ గేటు ఉన్నట్లుండి ఊడిపోయింది.

By Srikanth Gundamalla  Published on  11 Aug 2024 7:47 AM IST
Tungabhadram dam gate, fell down, Karnataka ,

 కొట్టుకుపోయిన తుంగభద్ర డ్యామ్‌ గేటు. పోటెత్తిన వరద

కర్ణాటకలో ప్రమాదం చోటుచేసుకుంది. హోస్పేట్‌లో ఉన్న తుంగభద్ర డ్యామ్‌లో 19వ గేటు ఉన్నట్లుండి ఊడిపోయింది. డ్యామ్‌ గేట్‌ కొట్టుకుపోయింది. దాంతో.. డ్యామ్‌ నుంచి దిగువకు నీరు పోటెత్తుతోంది. తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో తగ్గడంతో శనివారం అర్ధరాత్రి డ్యామ్‌ గేట్లను మూసివేసేందుకు అధికారులు ప్రయత్నం చేశారు. ఈ సమయంలోనే 19వ గేటు చైన్‌ తెగిపోయి మొత్తం ఊడిపోయింది. దాంతో.. నీరు ఆ గేటు ద్వారా కిందకు వెళ్లిపోతుంది.

తుంగభద్ర ప్రాజెక్టు గేటు తెగిపోయి పడిపోవడంతో అధికారులు, పోలీసులు అర్ధరాత్రే అక్కడికి చేరుకున్నారు. ప్రాజెక్టు పరిస్థితిని పరిశీలించారు. ప్రాజెక్టు నుంచి 60 టీఎంసీల నీళ్లు బయటకు వదిలిన తర్వాతే గేటు పునరుద్ధరణ పనులు చేపట్టగలమని అధికారులు వెల్లడించారు. ఆదివారం ఉదయం డ్యామ్‌ను కొప్పాల్‌ జిల్లా ఇంచార్జ్‌ మంత్రి శివరాజ్ స్పందించారు. ప్రస్తుతం తుంగభద్ర డ్యామ్‌ 33 గేట్ల ద్వారా నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు నుంచి లక్షల వేల క్యూసెక్కుల నీరు బయటకు పోతుంది. డ్యామ్‌ భద్రతకు సంబంధించి ఇంత పెద్ద సంఘటన జరగడం 70 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. తుంగభద్ర డ్యామ్‌ గేట్‌ ఊడిపోయిందన్న సంఘటన సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



Next Story