దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటి వరకూ ఏడు రౌండ్లు పూర్తయ్యాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు.
దుబ్బాక ఉపఎన్నిక ఏడో రౌండ్ కౌంటింగ్ ముగిసే సరికి బీజేపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. మొదటి ఐదు రౌండ్లలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యంలో కొనసాగగా.. ఆరవ రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత 355 ఓట్ల ఆధిక్యంలో కొనసాగారు. అయితే అదే ఆధిక్యాన్ని ఏడో రౌండ్‌లో కూడా టీఆర్ఎస్ కొనసాగించింది. ఈ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి 182 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ప్రస్తుతం 2,667 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కొనసాగుతున్నారు. దుబ్బాకలో ఇప్పటి వరకు 52,055 ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తవగా.. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకు 22,762, టీఆర్‌ఎస్ అభ్యర్థి సుజాతకు 20,277, కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 4,003 ఓట్లు వచ్చాయి.