దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ‌: తొలిసారిగా ఆధిక్యంలోకి టీఆర్‌ఎస్

TRS lead In Dubbaka ByPoll Counting. దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌ ఆసక్తికరంగా మారింది. తొలుత కొన్ని రౌండ్లను

By Medi Samrat  Published on  10 Nov 2020 9:30 AM GMT
దుబ్బాక ఉపఎన్నిక కౌంటింగ్ ‌: తొలిసారిగా ఆధిక్యంలోకి టీఆర్‌ఎస్

దుబ్బాక ఎన్నికల కౌంటింగ్‌ ఆసక్తికరంగా మారింది. తొలుత కొన్ని రౌండ్లను వరుసగా బీజేపీ ఆధిక్యాన్ని కనబరచగా.. ప్రస్తుతం లెక్కిస్తున్న రౌండ్లలో వరుసగా టీఆర్‌ఎస్‌ ఆధిక్యాన్ని కనబరుస్తోంది. దీంతో ఇప్పటి వరకూ దాదాపు 4 వేల ఆధిక్యాన్ని కనబరిచిన బీజేపీ.. ప్ర‌స్తుతం ఎదురీదుతుంది.

కాగా.. దుబ్బాకలో 19వ రౌండ్‌ కౌంటింగ్‌ పూర్తయ్యే సమయానికి 251 ఓట్ల ఆధిక్యంలో టీఆర్ఎస్ అభ్యర్థి సుజాత కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి రఘునందన్‌కు 52802 ఓట్లు రాగా.. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సుజాతకు 53053 ఓట్లు.. కాంగ్రెస్‌ అభ్యర్థి శ్రీనివాస్‌రెడ్డికి 18,365 ఓట్లు లభించాయి. దుబ్బాకలో ఇప్పటి వరకు 1,38,807 ఓట్ల లెక్కింపు పూర్తైంది.


Next Story