దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రధాన పార్టీలు నువ్వా-నేనా అన్నట్టు తలపడుతున్నాయి. అధికార టీఆర్‌ఎస్ పార్టీ 13, 14 రౌండ్లలో ఆధిక్యత ప్రదర్శించింది. 13వ రౌండ్‌లో టీఆర్ఎస్‌కు 304 ఓట్ల ఆధిక్యం దక్కింది. 13వ రౌండ్‌లో టీఆర్‌ఎస్ 2824, బీజేపీ 2520, కాంగ్రెస్ 1212 ఓట్లు దక్కించుకున్నాయి. 14వ రౌండ్‌లో 288 ఓట్ల మెజారిటీని టీఆర్‌ఎస్ సాధించింది. 14 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి బీజేపీ 3,438 ఓట్ల ఆధిక్యంలో ఉంది.
ఇదిలావుంటే.. దుబ్బాక ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ఫలితం కోసం అన్ని పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందంజలో ఉన్నారు. కాగా టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానంలో ఉన్నారు. ఇప్పటివరకూ బీజేపీకి 41514, టీఆర్ఎస్‌కు 38,076, కాంగ్రెస్‌కు 12,658 ఓట్లు వచ్చాయి.