సెంచ‌రీ చేశాడు.. పాపం అలా ఔటైయ్యాడు

Tom Blundell dismissed for obstructing the field. సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో క్యాచ్, బౌల్డ్‌, ఎల్బీ, రనౌట్‌, స్టంపింగ్‌

By Medi Samrat  Published on  9 Nov 2020 9:25 AM GMT
సెంచ‌రీ చేశాడు.. పాపం అలా ఔటైయ్యాడు

సాధార‌ణంగా మ‌నం క్రికెట్‌లో క్యాచ్, బౌల్డ్‌, ఎల్బీ, రనౌట్‌, స్టంపింగ్‌, హిట్ వికెట్ వంటి ఔట్‌ల‌ను చూస్తుంటాం. కానీ బంతిని బ్యాట్స్‌మ‌న్ అడ్డుకుని ఔటైన సంద‌ర్భాలు చాలా అరుదు. అది కూడా సెంచ‌రీ కొట్టి మంచి ఊపు మీద ఉన్న ఆట‌గాడు.. ఇలా అరుదుగా ఔట్ అవ్వ‌డం చూసి ఎవ‌రైనా షాక్ అవుతారు. తాజాగా అటువంటి అరుదైన సంద‌ర్భ‌మే చోటు చేసుకుంది.

ప్లంకెట్‌ షీల్డ్‌ 2020-21 సీజన్‌లో భాగంగా వెల్టింగ్టన్‌-ఒటాగో జట్ల మధ్య జరిగిన న్యూజిలాండ్‌ దేశవాళీ మ్యాచ్‌లో ఒక బ్యాట్స్‌మన్‌ బంతిని చేతితో అడ్డుకుని పెవిలియన్‌ చేరాడు. వెల్టింగ్టన్‌ బ్యాట్స్‌మన్‌ టామ్‌ బ్లండెల్‌ ఒక బంతిని పొరపాటున చేతితో ఆపడానికి యత్నించి ఔటయ్యాడు. వెల్టింగ్టన్‌ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా బ్లండెల్‌ సెంచరీ చేశాడు. 147 బంతుల్లో 12 ఫోర్లతో 101 పరుగులు చేశాడు.

అయితే ఒటాగో బౌలర్‌ జాకబ్‌ డఫ్పీ వేసిన ఒక బంతిని ఆడబోగా అది బ్యాట్‌కు తగలకుండా వికెట్లపైకి వెళ్లబోయింది.దాన్ని ముందు కాలితో తన్ని ఆపిన బ్లండెల్‌.. మళ్లీ చేతితో దాన్ని బయటకు గెంటివేసే యత్నం చేశాడు. సాధారణంగా బ్యాట్‌తో కానీ కాలితో కానీ బంతిని ఆపితే ఔట్‌ ఉండదు. కానీ బంతి ల్యాండ్‌ అయిన తర్వాత దాన్ని చేతితో వికెట్లపైకి వెళ్లకుండా ఆపితే అది ఔట్‌గా నిర్దారిస్తారు. ఇలాగే ఔటయ్యాడు బ్లండెల్‌. దీన్ని అబ్‌స్ట్రక్టింగ్‌ ఔట్‌గా పరిగణిస్తారు. ఈ మ్యాచ్‌లో వెల్లింగ్టన్‌ 84 పరుగుల తేడాతో ఓటమి చెందింది. ప్ర‌స్తుతం ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. కొంద‌రు ఈ వీడియో చూసి అయ్యో పాపం అంటున్నారు.


Next Story