రేవ్‌పార్టీ కేసులో జైలు నుంచి బయటకొచ్చిన నటి హేమ

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  14 Jun 2024 11:51 AM GMT
tollywood, actress hema,   bengaluru jail,

రేవ్‌పార్టీ కేసులో జైలు నుంచి బయటకొచ్చిన నటి హేమ

ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్‌ పార్టీ కేసు సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇదే కేసులో టాలీవుడ్‌ నటి హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు. తాజాగా హేమ షరతులతో కూడిన బెయిల్‌పై బయటకు వచ్చారు. బెంగళూరు నగర శివారులో జరిగిన రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్‌ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో అరెస్ట్ చేశారు. ఈ కేసులోనే తనకు బెయిల్‌ ఇవ్వాలని కోర్టులో పిటిషన్‌ వేయగా.. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది స్థానిక కోర్టు.

నటి హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లేవనీ.. ఆమెపై ఆరోపణలు వచ్చిన పది రోజులకు వైద్య పరీక్షలు నిర్వహించారని హేమ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు. అంతేకాదు.. హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసుల వద్ద ఎలాంటి సాక్ష్యాలు లేవని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగా.. హేమ రేవ్‌పార్టీలో పాల్గొన్నట్లుగా ఆధారాలను సీసీబీ న్యాయవాది కోర్టుకు సమర్పించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయస్థానం నటి హేమకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది.

కాగా.. రేవ్‌పార్టీ కేసు సందర్భంగా నటి హేమ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ముందుగా ఆమె బెంగళూరు రేవ్‌ పార్టీలో పాల్గొనలేదంటూ.. తాను ఫామ్ హౌస్‌లో ఉన్నానంటూ వీడియో విడుదల చేశారు. కానీ.. ఆమె రేవ్‌ పార్టీలో ఉన్నారంటూ రుజువులను చూపించారు పోలీసులు. ఆ తర్వాత నాటకీయ పరిణామాల తర్వాత హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఆమె బెయిల్‌పై జైలు నుంచి బయటకు వచ్చింది.

Next Story