బెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ నటుడు శ్రీకాంత్ వీడియో
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ హాట్ టాపిక్‌గా మారింది.
By Srikanth Gundamalla Published on 20 May 2024 5:25 PM ISTబెంగళూరు రేవ్ పార్టీకి వెళ్లలేదంటూ నటుడు శ్రీకాంత్ వీడియో
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న పలువురు తెలుగు సినీ ప్రముఖులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో ఉన్న బీఆర్ ఫామ్‌హౌస్‌లో బర్త్‌డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారని పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీలో విచ్చలవిడిగా మందుతో పాటు మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన యాక్టర్లు, మోడళ్లు ఉన్నారంటూ వార్తలు వినిపిస్తుండటంతో అందరూ ఈ రేవ్‌పార్టీ వ్యవహారంపైనే దృష్టి పెట్టారు.
ఇక ఇదే రేవ్ పార్టీలో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ కూడా పాల్గొన్నారంటూ వార్తలు వినిపించాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న వ్యక్తిలో ఒకరు శ్రీకాంత్‌లాగే ఉన్నారనీ.. అది ఆయనే అంటూ కొందరు కన్ఫామ్ చేసి వార్తలు ప్రచారం చేశారు. ఈ మేరకు ఇంట్లోనే ఉన్న నటుడు శ్రీకాంత్ స్వయంగా ఒక వీడియోను రికార్డు చేసి విడుదల చేశారు. ఈ మేరకు వీడియో చేసిన శ్రీకాంత్.. తాను రేవ్ పార్టీలకు పబ్‌లకు వెళ్లే వ్యక్తిని కాదని చెప్పారు. ప్రస్తుతం తాను హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఉన్నట్లు పేర్కొన్నారు. గతంలో కొందరు తాను విడాకులు తీసుకుంటున్నట్లు తప్పుడు వార్తలు రాశారనీ.. ఇప్పుడేమో రేవ్ పార్టీ అంటూ ప్రచారం చేస్తున్నారని శ్రీకాంత్ వీడియోలో పేర్కొన్నారు.
రేవ్ పార్టీలో తాను ఉన్నానని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. అయితే.. ముందుగా ఈ వార్తలను చూసి తన కుటుంబ సభ్యులతో కలిసి నవ్వుకున్నానని చెప్పారు. అయితే.. బెంగళూరులో పోలీసులకు పట్టుబడ్డ వారిపై వీడియో బయటకు రాగా.. అందులో సేమ్ తనలాగే ఒకరు ఉన్నారని చెప్పారు. కాకపోతే ఇప్పుడతనికి గడ్డం ఉందనీ.. తనకు లేదని అన్నారు. అతన్ని చూసి తానే షాక్ అయినట్లు చెప్పారు. ఇక రేవ్ పార్టీకి తాను వెళ్లలేదని మరోసారి నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.
రేవ్ పార్టీలు, పబ్‌లకు వెళ్లే వ్యక్తిని నేను కాదు: నటుడు శ్రీకాంత్
— Newsmeter Telugu (@NewsmeterTelugu) May 20, 2024
బెంగళూరు రేవ్ పార్టీకి తాను వెళ్లలేదంటూ వీడియో
ఇంట్లో ఉన్నానంటూ వీడియో తీసిన నటుడు శ్రీకాంత్ pic.twitter.com/8z9yjWjYLE