త్వరలోనే టెలిగ్రామ్‌ యాప్‌పై భారత్‌లో నిషేధం..!

టెలిగ్రామ్‌ ఫౌండర్‌ పావెల్‌ దురోవ్‌ను ఓ కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  27 Aug 2024 1:00 PM IST
telegram, app, ban,  india,

 త్వరలోనే టెలిగ్రామ్‌ యాప్‌పై భారత్‌లో నిషేధం..!

టెలిగ్రామ్‌ ఫౌండర్‌ పావెల్‌ దురోవ్‌ను ఓ కేసులో పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా టెలిగ్రామ్‌ యాప్‌ నిర్వహణకు సంబందించి పలు అనుమానాలు ఉన్నాయి. దాంతో.. భారత్‌లో టెలిగ్రామ్‌ను భారత్‌లో నిషేధించేందుకు అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది. మోసాలు, జూదం వంటి క్రిమినల్ చర్యలకు ఈ యాప్‌ను వినియోగిస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దాంతో.. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇండియన్ సైబర్ క్రైమ్‌ కోఆర్డినేషన్ సెంటర్‌ విచారణ చేపట్టింది. టెలిగ్రామ్‌ ఐటీ నిబంధనలు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఒక వేళ నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు నిర్ధారణ అయితే టెలిగ్రామ్‌ను దేశంలో బ్యాన్‌ చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా.. భారత్‌లోనే 5 మిలియన్లకు పైగా టెలిగ్రామ్ వినియోగదారులు ఉన్నారు. ఇలా చాలా మంది ఈ యాప్‌ను వినియోగిస్తున్న వేళ తోసిపుచ్చలేమని ఓ అధికారి తెలిపారు. దర్యాప్తుపై ఆధారపడి ఉంటుందని చెప్పారు. మానవ అక్రమ రవాణా, డ్రగ్స్, ఉగ్రవాదం, మోసాలు, సైబర్‌ బెదిరింపులు వంటి ఆరోపణలతో టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈఓ పావెల్‌ దురోవ్‌ అరెస్టయిన మూడు రోజుల్లోనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. దురోవ్‌ను పారిస్ సమీపంలోని ఓ విమానాశ్రయంలో ఫ్రెంచ్ అధికారులు ఆదివారం అరెస్టు చేశారు.

కాగా.. టెలిగ్రామ్‌ గతంలో కూడా విమర్శలను ఎదుర్కొంది. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. ఇటీవల UG-NEET పేపర్ లీక్ అంశంలో దీని పాత్రను సీబీఐ గుర్తించింది. మెడికల్ ఎంట్రన్స్ టెస్ట్ పేపర్‌ను ప్లాట్‌ఫారమ్‌లో విస్తృతంగా షేర్ చేసి, ఒక్కోదాన్ని రూ.5,000 నుంచి రూ.10,000 వరకు విక్రయించినట్టు తేలింది. ఈ క్రమంలోనే టెలిగ్రామ్‌పై మరింత ఫోకస్‌ పెట్టారు. చర్యలు తప్పవని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Next Story