మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది.
By Knakam Karthik Published on 19 Feb 2025 9:08 PM IST
మిస్ వరల్డ్ పోటీలకు ఆతిథ్యమివ్వనున్న తెలంగాణ..ఎప్పటి నుంచో తెలుసా?
మిస్ వరల్డ్ పోటీలకు తెలంగాణ ఆతిథ్యమివ్వనుంది. 72వ మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానుంది. ఈ వేడుకలను హైదరాబాద్ లో నిర్వహించనున్నట్లు టూరిజం శాఖ సెక్రెటరీ స్మిత సబర్వాల్, మిస్ వరల్డ్ సంస్థ సీఈఓ జూలియా మొర్లే వెల్లడించారు. మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలేను భాగ్యనగరంలోనే నిర్వహించనున్నారు. మే 7 నుంచి 31 వరకు జరగనున్న ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నారు. నాలుగు వారాల పాటు తెలంగాణలోని వివిధ ప్రదేశాల్లో ఈ మిస్ వరల్డ్ పోటీలు నిర్వహించనున్నారు.
హైదరాబాద్లో మిస్ వరల్డ్ ప్రారంభ, ముగింపు వేడుకలు, గ్రాండ్ ఫినాలే నిర్వహించనున్నామని.. ఈ పోటీల్లో 120 దేశాల నుంచి యువతులు పాల్గొననున్నట్లు తెలిపారు. కాగా.. 2024లో 71వ మిస్ వరల్డ్ పోటీలు ముంబైలో జరిగాయి. 28 ఏళ్ళ తర్వాత 71వ మిస్ వరల్డ్ పోటీలకు ఆతిధ్యం ఇచ్చింది ఇండియా. ఈ పోటీలో జెక్ రిపబ్లిక్ కి చెందిన క్రిస్టినా పీజ్కోవా మిస్ వరల్డ్ గా గెలుపొందింది. 1996లో మొదటిసారి ఇండియాలో మిస్ వరల్డ్ పోటీలు జరగగా ఈ పోటీల్లో గ్రీస్ కి చెందిన ఇరెనా స్క్రీవా కిరీటాన్ని గెలుచుకుంది. ఈ పోటీల్లో భారత్ టాప్ 5లో నిలిచింది. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ మిస్ వరల్డ్ పోటీలకు ఇండియా వేదిక కానుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ చైర్ పర్సన్ అండ్ సీఈఓ జూలియా మూర్లే తెలిపారు.