ఏపీలో అసెంబ్లీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడింది.
By Srikanth Gundamalla Published on 2 Jun 2024 7:00 AM GMTఏపీలో అసెంబ్లీ ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్స్
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సబ ఎన్నికల కౌంటింగ్‌కు సమయం దగ్గరపడింది. జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. అయితే.. ఇప్పటికే విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు మరింత ఉత్కంఠను రేపుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేది ఆసక్తిగా మారింఇ. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమిదే అధికారం అని వెల్లడిస్తే.. మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ మాత్రం మరోసారి వైఎస్ జగన్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కడతారని చెబుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లో కన్ఫ్యూజన్ పెరిగింది.
ఎగ్జిట్ పోల్స్ తర్వాత జనాలకు ఫలితాలపై ఒక క్లారిటీ వస్తుంది. నెంబర్స్ పూర్తిగా కరెక్ట్ కాకపోయినా.. అట ఇటుగా ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగా ఉంటాయి. కానీ.. ఈసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే పార్టీ విషయంలో క్లారిటీ రాలేదు. ఒక్కరు ఒక్కోలా ఇచ్చారు ఎగ్జిట్ పోల్స్. జూన్ 4న నరాలు తెగే ఉత్కంఠ ఉండబోతుందని మాత్రం అర్థం అవుతోంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వం రాబోతుందని వ్యాఖ్యానించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. గతంలో కూడా ఆయన కోమటిరెడ్డి ఇదే తరహా కామెంట్స్ చేశారు. కానీ.. ఫలితాలు మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న క్రమంలో ఆయన మరోసారి ఈ వ్యాఖ్యలు చేయడంతో వైరల్ అవుతున్నాయి. ఏపీలో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పడం వెనుక కారణం కూడా ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన బంధువులు, స్నేహితులు, తెలిసినవారు ఇచ్చిన సమాచారం మేరకే ఈ కామెంట్స్ చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వెల్లడించారు.