తెలంగాణలో కొత్తగా 1,196 పాజిటివ్‌ కేసులు

Telangana corona cases Updates I తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,196 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  11 Nov 2020 4:12 AM GMT
తెలంగాణలో కొత్తగా 1,196 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,196 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఐదుగురు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,53,651 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 1,390 మంది మృతి చెందారు. ఇక కరోనా నుంచి తాజాగా 1,745 మంది డిశ్చార్జ్‌ కాగా, మొత్తం కోలుకుని డిశ్చార్జ్‌ అయినవారి సంఖ్య 2,34,234కు చేరింది. ప్రస్తుతం తెలంగాణలో 18,027 యాక్టివ్‌ కేసులుంగా, 15205 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది.

ఇక గడిచిన 24 గంటల్లో44,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం 47,29,401 పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక తాజాగా అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 192 కేసులు నమోదు కాగా, మేడ్చల్‌ మల్కాజిగిరి 101, రంగారెడ్డి 121 నమోదు కాగా, ఇతర జిల్లాల్లో వందలోపు కేసులు నమోదయ్యాయి.
Next Story