చాక్లెట్‌లో దంతాల సెట్.. నమిలేందుకు ప్రయత్నించి షాకైన టీచర్
ఈ మధ్యకాలంలో ఆహారంలో కల్తీ ఎక్కువైపోయింది.
By Srikanth Gundamalla Published on 23 July 2024 7:17 AM ISTచాక్లెట్‌లో దంతాల సెట్.. నమిలేందుకు ప్రయత్నించి షాకైన టీచర్
ఈ మధ్యకాలంలో ఆహారంలో కల్తీ ఎక్కువైపోయింది. ఐస్‌క్రీమ్‌లో చేతివేలు రావడం.. చాక్లెట్స్‌లో పురుగులు కనిపించడ వంటికి ఆందోళనకు గురి చేశాయి. ఏదైనా కొని తినాలంటేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. తాజాగా చాక్లెట్‌లో ఏకంగా నాలుగు పళ్లతో కూడిన సెట్ కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బాధితురాలు దీనికి సంబంధించిన ఫోటోను.. అనుభవాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్‌లో రిటైర్ట్ స్కూల్ ప్రిన్సిపల్ చాక్లెట్‌లో నాలుగు పళ్లతో కూడిన సెట్‌ను కొనుగొన్నారు. బాదితురాలి పేరు మాయాదేవి. ఆమె కొద్దిరోజుల క్రితమే ఒకరి పుట్టిన రోజు సందర్భంగా పిల్లల నుంచి చాక్లెట్ అందుకున్నారు. దాన్ని తాజాగా తినేందుకు ప్రయత్నించగా.. ఆమె నోట్లోకి ఏదో గట్టిగా తగిలింది. ముందుగా చాక్లెట్ గట్టిగా ఉందేమే అనుకుని మరోసారి నమిలేందుకు ప్రయత్నించింది. కానీ.. అది పంటి కింద నలగలేదు. దాంతో.. ఒక్కసారిగా బయటకు తీయడంతో.. వాటిని చూసి షాక్ తిన్నది. నాలుగు దంతాల సెట్‌ను చూసి ఆందోళనకు గురైనట్లు మాయాదేవి చెప్పింది.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న మాయాదేవి ఖర్గోన్‌లోని జిల్లా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ బృందాన్ని ఏర్పాటు చేశామని.. దర్యాప్తు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారి హెచ్‌ఎల్ అవాసియా తెలిపారు. చాక్లెట్లు కొనుగోలు చేసిన దుకాణం నుండి నమూనాలను తీసుకుంది. అలాగే.. మహిళ వద్ద ఉన్న చాక్లెట్ నమూనాలను డిపార్ట్‌మెంట్ ప్రయోగశాలకు పంపించినట్లు తెలిపారు.