గోపీచంద్ హీరోగా తెరకెక్కిన విశ్వం సినిమాతో ఆరేళ్ల తర్వాత శ్రీను వైట్ల దర్శకుడిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఆయన గత చిత్రం అమర్ అక్బర్ ఆంటోని (2018) బాక్సాఫీస్ వద్ద పరాజయం పాలైంది. ఈ రెండు సినిమాల మధ్య లాంగ్ గ్యాప్ రావడానికి గల కారణాలను వివరించారు. ఇన్నేళ్లలో నేను సినిమా చేయకపోయినా నా స్టయిల్ హ్యూమర్ నచ్చి సోషల్ మీడియాలో తరచూ సర్క్యులేట్ అవుతుండటం గమనించాను అన్నారు.
నేను నా వినోద శైలితో కొత్త అంశం ఫై సినిమా తీయడం జరిగిందన్నారు. అది సులభమైన విషయం కాదు మరియు క్రాక్ చేయడానికి సమయం పడుతుందన్నారు. 2018లో సినిమాకు పనిచేసిన అనుభవాన్ని కన్ఫ్యూజన్ పీరియడ్లో తీసుకున్న నిర్ణయంగా దర్శకుడు వివరించారు. ఈ ప్రాజెక్టుపై తమ నిర్మాతలు పెట్టిన పెట్టుబడిని తిరిగి రాబట్టుకున్నప్పటికీ..నిర్మాతల అభిరుచులతో పాటు ప్రేక్షకుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవడమే ఈ చిత్రం నుండి తన వ్యక్తిగత పాఠాలు అన్నారు.
గోపీచంద్ తర్వాత స్క్రిప్ట్ వర్క్ చేయడానికి ఎనిమిది నెలలు పట్టిందన్నారు. నా సంతృప్తికి అనుగుణంగా వివిధ అంశాలు చేయడానికి సమయం తీసుకున్నాని తెలిపారు. నా నుండి ఆశించే అంశాలు.. యాక్షన్, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్తో పాటు.. ఇక్కడ కథలో ఎమోషనల్ డెప్త్ కూడా ఉంటుందన్నారు. ఇది నేను ఇంతకు ముందు చేయని అంశంగా ఆయన పేర్కొన్నారు.