ఆందోళన వద్దు.. షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది

డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కారణంగా షారుఖ్ ఖాన్ బుధవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు.

By Medi Samrat  Published on  23 May 2024 1:45 PM IST
shah rukh khan, health, juhi chawla,

ఆందోళన వద్దు.. షారుఖ్ ఖాన్ ఆరోగ్యం బాగానే ఉంది

డీహైడ్రేషన్, హీట్ స్ట్రోక్ కారణంగా షారుఖ్ ఖాన్ బుధవారం అహ్మదాబాద్‌లోని ఆసుపత్రిలో చేరారు. షారుఖ్ ఖాన్ ను భార్య గౌరీ ఖాన్, స్నేహితురాలు జుహీ చావ్లా సందర్శించారు. మంగళవారం కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్) వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఐపిఎల్ మ్యాచ్‌లో నటుడు షారూఖ్‌కు హీట్ స్ట్రోక్ రావడంతో కెడి ఆసుపత్రికి తీసుకెళ్లారు. షారుఖ్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా జూహీ చావ్లా అప్డేట్ ను పంచుకున్నారు.

"షారుఖ్ గత రాత్రి కాస్త ఇబ్బంది పడ్డారు, ప్రస్తుతం చాలా బాగున్నారు. అతను త్వరలో లేచి, వారాంతంలో ఐపీఎల్ ఫైనల్స్ ఆడేటప్పుడు జట్టును ఉత్సాహపరుస్తాడు." అని చెప్పడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. షారుఖ్ ఖాన్ వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. క్వాలిఫయర్-1 జరిగిన అహ్మదాబాద్‌లో 45 డిగ్రీల సెల్సియస్ అధిక ఉష్ణోగ్రత మధ్య షారుఖ్ ఖాన్ డీహైడ్రేషన్‌తో బాధపడ్డాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నప్పటికీ వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఆసుపత్రి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారని అధికారులు తెలిపారు.

Next Story