స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో వరుసగా కొద్ది రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు.

By Srikanth Gundamalla  Published on  13 Sept 2024 7:15 PM IST
స్కూళ్లకు వరుసగా నాలుగు రోజులు సెలవులు

తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన వర్షాలతో వరుసగా కొద్ది రోజుల పాటు స్కూళ్లకు సెలవులు ఇచ్చారు. ఆ తర్వాత వినాయక చవితి సెలవు వచ్చింది. తాజాగా మరో నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లు మూత పడుతున్నాయి. ఏకంగా నాలుగు రోజులు సెలవులు వస్తుండటంతో విద్యార్థులు ఎగిరి గంతేస్తున్నారు. అయితే.. ప్రతి నెలా రెండో శనివారం విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయి. సెప్టెంబర్ 14వ తేదీన సెలవు ఉంటుంది. అలాగే ఆదివారం సెప్టెంబర్‌ 15న కూడా సెలవు ఉంటుంది.

ఆ తర్వాత సెప్టెంబర్‌ 16వ తేదీన ముస్లింల పండగ మిలాద్‌ ఉన్‌ నబీ ఉంది. ముస్లింలు ఈ పండుగను తమ ఆరాధ్య దైవం మహ్మద్ ప్రవక్త పుట్టినరోజున ఈ పండగను జరుపుకుంటారు. దాంతో.. ఆరోజు కూడా సెలవు ఉంటుంది. కానీ.. తెలంగాణలో ఆరోజు హాలీడేపై ఇంకా క్లారిటీ లేదు. మంగళవారం సెప్టెంబర్‌ 17వ తేదీన కూడా సెలవు ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పట్టణాలు, పల్లెల్లో వినాయక నిమజ్జనాలు ఘనంగా చేస్తారు. దాంతో.. ఆ రోజు కూడా హాలీడే ఉంటుంది. దాంతో.. మొత్తంగా నాలుగు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి. నెలవంక దర్శనాన్ని బట్టి మిలాద్ ఉన్ నబి పండగ సెప్టెంబర్ 16న జరుగుతుందా లేక సెప్టెంబర్ 17న జరుపుకుంటారా అన్నది తేలనుంది. ఒకవేళ సెప్టెంబర్ 15న నెలవంక కనిపించిందంటే సెప్టెంబర్ 16నే మిలాద్ ఉల్ నబి వుంటుంది. అలా వరుసగా నాలుగు రోజుల సెలవు తర్వాత సెప్టెంబర్ 18వ తేదీన స్కూళ్లు పునఃప్రారంభం అవుతాయి. ఆ తర్వాత నాలుగు రోజులే సండే వస్తోంది. ఆ రోజు కూడా హాలీడే ఉంటుంది.

Next Story