విడాకుల తర్వాత సోషల్‌మీడియాలో సానియా ఆసక్తికర పోస్టు

షోయబ్‌ మాలిక్‌, సానియా మీర్జా వివాహ బంధం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.

By Srikanth Gundamalla  Published on  26 Jan 2024 9:00 AM GMT
sania mirza, instagram, first post,  divorce,

విడాకుల తర్వాత సోషల్‌మీడియాలో సానియా ఆసక్తికర పోస్టు 

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌, భారత టెన్నిస్‌ మాజీ క్రీడాకారిణి సానియా మీర్జా వివాహ బంధం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. వారు విడిపోతున్నట్లు ఇటీవలే ప్రకటించారు. అంతేకాదు షోయబ్ మాలిక ఏకంగా మరొకరిని వివాహం కూడా చేసుకున్నారు. అది అతనికి మూడో వివాహం. షోయబ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత సానియా మీర్జా తొలిసారి సోషల్‌ మీడియా వేదిక స్పందించింది. ఒక పోస్టు పెట్టింది. ప్రస్తుతం నెట్టింట అది వైరల్ అవుతోంది.

అద్దంలో తనని తాను చూసుకుంటున్నట్లుంగా ఒక ఫొటోను సానియా మీర్జా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్‌ చేసింది. దానికి 'రిఫ్లెక్ట్‌' అంటూ ఓ క్యాప్షన్ కూడా ఇచ్చింది. సోషల్‌ మీడియా వేదికగా పెట్టిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక విడాకులు తీసుకున్న తర్వాత తొలిసారి పెట్టిన పోస్టు కావడంతో నెటిజన్లు అంతరార్థాలు వెతుకుతున్నారు. విడాకుల గురించి ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోయినా.. సానియా మీర్జా తనని తాను సమీక్షించుకుంటున్నట్లు అర్థం వచ్చేలా ఈ పోస్టు పెట్టింది. దాంతో.. ఇప్పుడు ఆసక్తికంగా మారిందని నెటిజన్లు అంటున్నారు.

కాగా.. షోయబ్-సానియా విడిపోతున్నట్లు గత ఏడాది నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ.. ఈ వార్తలపై వారెప్పుడూ క్లారిటీ ఇవ్వలేదు. ఇంతలోనే షోయబ్ సానియతో వివాహ బంధాన్ని తెగదెంపులు చేసకుంటూ మరో ఇన్నింగ్స్‌కు తెరతీశాడు. మరోసారి పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సినీతార సనా జావెద్‌ను అతను వివాహం చేసుకున్నాడు. షోయబ్‌కు ఇది మూడో వివాహం అయితే.. సనాకు ఇది రెండో వివాహం. సోషయ్‌ 2010లో అయేషా సిద్ధిఖీకి విడాకులు ఇచ్చి.. అదే ఏడాది సానియాను పెళ్లి చేసుకున్నాడు. 2018లో వీరిద్దరికీ కొడుకు పుట్టాడు. గత కొంతకాలంఆ ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. ఆ తర్వాత ఆ దూరం మరింత పెరిగి విడాకులు తీసుకున్నారు.

Next Story