విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా

విదేశాల నుండి వచ్చిన విరాళాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుండి వేలు కాదు లక్షలు కాదు ఏకంగా ఏడు కోట్ల పైచిలుకు నగదును కాజేసిన ఘటన హైదరాబాద్ నగరం లో వెలుగు చూసింది.

By Kalasani Durgapraveen  Published on  10 Oct 2024 7:16 AM GMT
విరాళాలు ఇప్పిస్తామని కోట్ల రూపాయలు స్వాహా

విదేశాల నుండి వచ్చిన విరాళాలు ఇప్పిస్తామని నమ్మించి బాధితుడి వద్ద నుండి వేలు కాదు లక్షలు కాదు ఏకంగా ఏడు కోట్ల పైచిలుకు నగదును కాజేసిన ఘటన హైదరాబాద్ నగరం లో వెలుగు చూసింది.బాధితుడు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ను ఆశ్రయించడంతో రంగంలోకి దిగి ఇటువంటి మోసాలకు పాల్పడిన నిందితుడిని అరెస్టు చేశారు.

నల్గొండ జిల్లాలోని కొండమల్లేపల్లికి చెందిన ఒక వ్యక్తి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఇతని భాగస్వామి అయినా గిరి ద్వారా నిందితుడు రాథోడ్తో పరిచయం ఏర్పడింది. గిరి, రాథోడ్ ఈ ఇద్దరికీ బెంగళూరు చెందిన సునీల్ కుమార్ తో పరిచయం ఏర్పడింది. దీంతో సునీల్ కుమార్.. గిరి, రాథోడ్ తో కలిసి విదేశాల నుండి వచ్చిన విరా ళాలు ఇప్పిస్తామని బాధితుడిని నమ్మించారు. అయితే విదేశాల నుండి వచ్చిన కోట్ల రూపాయల విరాళాలు హైదరాబాదులోని అంతర్జాతీయ ఎయిర్పోర్ట్లో కస్టమ్స్ అధికారుల వద్ద బ్లాక్ అయ్యాయని ఆ విధంగా అధికారుల వద్ద బ్లాక్ అయిన అమౌంట్ ని విడుదల చేయాలంటే అడ్వాన్స్, ఇతర ట్యాక్యులు చెల్లిస్తే కస్టమ్స్ సీజ్ చేసిన డబ్బులో 30% ఇప్పిస్తామని నిందితులు బాధితుడిని నమ్మించారు. వారి మాటలు నిజమని నమ్మిన బాధితుడు మొదటగా 38,50,000 రూపాయలు సునీల్ కుమార్ బ్యాంకు ఖాతాకు బదిలీ చేశాడు. సునీల్ కుమార్ బాధితుడిని నమ్మడానికి అంతర్జాతీయ ఏజెన్సీలు జారీ చేసినట్లుగా నకిలీ లేఖలను వాట్సాప్ ద్వారా పంపించి బాధితుడిన్ని పూర్తిగా నమ్మించారు. నిందితులు చెప్పిన మాటలు నమ్మిన బాధితుడు ఆగస్టు 2023 నుండి ఏప్రిల్ 2024 వరకు 280 లావాదేవీల్లో రూ 7.18 కోట్ల రూపాయలను సునీల్ కుమార్ తో సహా 80 బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేశాడు. అయితే బాధితుడికి టెక్స్ టైల్స్ మంత్రిత్వ శాఖ నుండి కూడా నకిలీ లేఖ వచ్చినట్లుగా చూపించి మోసం చేశారు. ఈ విధంగా బాధితుడు 7.19 కోట్ల రూపాయలు నష్టపోయిన తర్వాత తాను మోసపోయానని గ్రహించి హైదరాబాద్ సైబర్ క్రైమ్ బ్యూరో ఆశ్రయిం చాడు. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలోకి దిగి... బెంగళూరుకి చెందిన సునీల్ కుమార్(35) ఇటు వంటి మోసాలకు పాల్పడినట్లుగా గుర్తించి అతన్ని అరెస్టు చేసి అతని వద్ద నుండి ఒక మొబైల్ ఫోన్, ఒక ఏటీఎం కార్డు స్వాధీనం చేసుకున్నారు.

Next Story