మా బెస్ట్ ఇంకా చూపించలేదు.. ఫైనల్ లో ముంబై మీద చూస్తారు

Ricky Ponting On IPL Final Match. ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లు తలపడ్డాయి.

By Medi Samrat  Published on  10 Nov 2020 7:12 PM IST
మా బెస్ట్ ఇంకా చూపించలేదు.. ఫైనల్ లో ముంబై మీద చూస్తారు

ఈ ఏడాది ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మూడు సార్లు తలపడ్డాయి. లీగ్ దశలో రెండు సార్లు తలపడగా, క్వాలిఫయర్ 1 లో ఇంకోసారి తలపడ్డాయి. ఈ మూడు సార్లు ముంబై ఇండియన్స్ విజయం సాధించడంతో ఫైనల్ లో కూడా ముంబై మీద అంచనాలు భారీగా ఉన్నాయి. నాలుగో సారి గెలిచి టైటిల్ సొంతం చేసుకోవాలని ముంబై భావిస్తోంది.

ఫైనల్ ముందు ఢిల్లీ కేపిటల్స్ హెడ్‌ కోచ్‌ రికీ పాంటింగ్‌ మాట్లాడారు. ఢిల్లీ కేపిటల్స్ నుండి అత్యుత్తమ క్రికెట్‌ ఇంకా రావాల్సి ఉందని.. అది ఫైనల్‌ మ్యాచ్‌ ద్వారా నెరవేరుతుందని ఆశిస్తూ ఉన్నానని తెలిపాడు. ఐపీఎల్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు సంబంధించి ప్రిమ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఫైనల్‌లో తమ కుర్రాళ్లు అత్యుత్తమ ఆటను ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారని.. ఈ సీజన్‌ను అత్యుత్తమంగా ముగించే సత్తా ఢిల్లీకి ఉందని చెప్పుకొచ్చాడు.

నేను భారీ అంచనాలతో యూఏఈకి వచ్చానని అన్నాడు. ఢిల్లీ కేపిటల్స్ బెస్ట్ జట్టు.. సీజన్‌ ఆరంభంలో ఢిల్లీ ప్రదర్శనే ఇందుకు ఉదాహరణ అని తెలిపాడు. చివరి మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌లు గెలిచాం. ఫైనల్‌లో కూడా మేము ఏమిటో చూపిస్తాం. మాకు ఇదొక మంచి సీజన్.. మేము టైటిల్‌ గెలవడం కోసమే ఇక్కడ ఉన్నామని చెప్పుకొచ్చాడు. ఫైనల్ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఢిల్లీ కేపిటల్స్ జట్టు బ్యాటింగ్ ను తీసుకుంది.


Next Story