పవన్‌ గురించి రేణుదేశాయ్ వీడియో..మూడు పెళ్లిళ్లపై కీలక కామెంట్స్

రేణుదేశాయ్‌ కీలక వీడియో విడుదల చేశారు. పవన్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ఆశయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

By Srikanth Gundamalla  Published on  10 Aug 2023 5:54 PM IST
Renu desai, Video,  Pawan kalyan, Viral,

 పవన్‌ గురించి రేణుదేశాయ్ వీడియో..మూడు పెళ్లిళ్లపై కీలక కామెంట్స్

కొంతకాలంగా పవన్‌ కళ్యాణ్ సినిమాల్లో కన్నా.. పొలిటికల్‌ లైఫ్‌కు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజలకు మేలు చేయాలన్న లక్ష్యంతో ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్‌పై రాజకీయంగా విమర్శలు ఎక్కువయ్యాయి. వాటిల్లో ప్రధానంగా టార్గెట్ చేసి విమర్శలు చేసేది మూడు పెళ్లిళ్ల గురించి. ప్రతిసారి పవన్‌ కళ్యాణ్‌ వ్యక్తిగత జీవితం గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో రేణుదేశాయ్‌ కీలక వీడియో విడుదల చేశారు. పవన్ వ్యక్తిత్వం, ఆయన రాజకీయ ఆశయం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రేణుదేశాయ్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియో తెలుగు రాష్ట్రాల్లో తెగ వైరల్ అవుతోంది.

పవన్‌ కళ్యాణ్, రేణు దేశాయ్‌కి మధ్య విడాకులు జరిగిన విషయం తెలిసిందే. రెండో భార్యగా ఉన్న రేణు దేశాయ్‌ పవన్‌తో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె పిల్లలతో కలిసి ఉంటున్నారు. ఇక పవన్‌ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. ఈ తరుణంలో రేణు దేశాయ్ తన సోషల్‌ మీడియా అకౌంట్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ గురించి ఆసక్తికర వీడియోను పోస్టు చేశారు. పవన్‌పై రాజకీయ ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలు ఆమె తప్పుబట్టారు. ఇకనైనా వాటికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలని కోరారు. గత కొంతకాలంగా జరుగుతున్న ప్రచారానికి ఎండ్‌ కార్డ్ వేసేందుకే ఈ వీడియో తీస్తున్నట్లు రేణు దేశాయ్‌ చెప్పుకొచ్చారు.

పవన్ కళ్యాణ్‌ చాలా అరుదైన వ్యక్తి అని.. రాజకీయంగా తన మద్దతు పవన్‌కు ఉంటుందని తేల్చి చెప్పారు రేణు దేశాయ్. అంతేకాకుండా బ్రో సినిమాలో శ్యాంబాబు వివాదంపైనా ఆమె స్పందించారు. మొదట్నుంచి ఇప్పటికీ ఎప్పటికీ పవన్‌కు రాజకీయ పరంగా సపోర్ట్‌ చేస్తూనే ఉన్నానని అన్నారు. తన జీవితంలో తాను ముందుకు సాగిపోతున్నానని.. అలాగే పవన్‌ కూడా రాజకీయ జీవితంలో ముందుకు వెళ్తున్నారని చెప్పారు. పవన్ కళ్యాణ్ మనీ మైండెడ్ కాదని.. సమాజం, పేదవారి సంక్షేమం కోసం పనిచేయాలని అనుకునే వ్యక్తి అని రేణు దేశాయ్ తెలిపారు. పవన్‌కు పొలిటికల్‌గా ఎప్పుడూ అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు. రాజకీయంగా పవన్ చేస్తున్న సేవలను గుర్తించాలని కోరారు. ప్రజలకు సేవ చేయాలని లక్ష్యంతోనే ఫ్యామిలీని పక్కనబెట్టి రాజకీయాల్లోకి వచ్చారని అన్నారు. దయచేసి ఆయనకు ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఇక రాజకీయాల్లో వ్యక్తిగత దూషణలు సరికాదని రేణుదేశాయ్ చెప్పుకొచ్చారు. మూడు పెళ్లిళ్లపై రచ్చను దయచేసి ఆపాలని కోరారు. పవన్‌ పర్సనల్‌ లైఫ్‌పై వెబ్‌ సిరీస్, సినిమాలు తీస్తామని కొందరు రాజకీయ నాయకులు అంటున్నారని తెలిపారు. అలా చేయడం సరికాదని అన్నారు రేణు దేశాయ్. ఈ వెబ్‌ సిరీస్‌లో ఆయన పిల్లల గురించి.. మాజీ భార్యల జీవితం గురించి ఉంటుందని తెలిసందన్నారు. తన ఇద్దరు పిల్లలే కాదు..మిగతా ఇద్దరి పిల్లలను కూడా ఇందులోకి లాగొద్దని రేణు దేశాయ్‌ కోరారు. బ్రో సినిమా వివాదం గురించి తనకు తెలియదని రేణు దేశాయ్ తెలిపారు.

Next Story