టాలీవుడ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..
టాలీవుడ్‌కు చెందిన ఒక హీరోయిన్ బెంగళూరు జట్టును కాదని.. SRH ఫేవరెట్ అన్నందుకు ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు.
By Srikanth Gundamalla Published on 30 April 2024 9:30 PM IST
టాలీవుడ్ హీరోయిన్‌ను ట్రోల్ చేస్తున్న ఆర్సీబీ ఫ్యాన్స్.. ఎందుకంటే..
ఐపీఎల్-2024 సీజన్ సందడిగా కొనసాగుతోంది. ఐపీఎల్ క్రేజ్ అందరికీ తెలిసిందే. ఒక్కో టీమ్‌కు ఒక్కో ఫ్యాన్ బేస్ ఉంటుంది. ముఖ్యంగా బెంగళూరు రాయల్ చాలెంజర్స్ టీమ్‌కు ఉన్న అభిమానులు.. మిగతా వారికంటే ఎక్కువనే చెప్పుకోవాలి. ఈ టీమ్ ఐపీఎల్‌లో ఒక్కసారి కూడా కప్ గెలవకపోయినా.. ఫ్యాన్ బేస్‌లో మాత్రం పైచేయి కొనసాగిస్తూనే వస్తోంది. అయితే.. తాజాగా టాలీవుడ్‌కు చెందిన ఒక హీరోయిన్ బెంగళూరు జట్టును కాదని.. ఎస్‌ఆర్‌హెచ్ ఫేవరెట్ అన్నందుకు ఆర్సీబీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఆమెను తెగ ట్రోల్ చేస్తూ.. తిట్టిపోస్తున్నారు.
టాలీవుడ్ యువ హీరోయిన్ రాశి సింగ్ బెంగళూరులో పుట్టి పెరిగింది. సినిమాల్లో భాగంగా టాలీవుడ్‌లో నటిస్తోంది. అయితే.. బెంగళూరులో పుట్టిన ఈ నటి.. ఆర్‌సీబీ టీమ్‌ను కాదన్నందుకు ఆ టీమ్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఆమెపై విమర్శలు చేస్తూ తెగ మండిపడుతున్నారు. బెంగళూరు పుట్టి పెరిగి సన్‌రైజర్స్ టీమ్‌కు ఓటేస్తావా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసమే హైదరాబాద్ టీమ్‌కు మద్దతు ఇస్తున్నావంటూ రాశి సింగ్‌ను టార్గెట్ చేశారు ఆర్‌సీబీ ఫ్యాన్స్. ఇక ఎస్‌ఆర్‌హెచ్ ఫ్యాన్స్ రాశి సింగ్‌కు మద్దతు తెలుపుతున్నారు.
ఆర్‌సీబీ ఫ్యాన్స్ తనని ట్రోల్ చేయడంపై హీరోయిన్ రాశి సింగ్ స్పందించింది. సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేసింది. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని చెప్పింది. హైదరాబాద్ అంటేతనకు ఇష్టమని తెలిపింది. ట్రోల్స్‌కు భయపడి తాను మాటమార్చబోయేది లేదని తెగేసి చెప్పింది ఈ యువ నటి. ఎస్‌ఆర్‌హెచ్‌కు సపోర్ట్ చేసినందుకు దుష్ప్రచారం చేయడం తగదని ఆమె పేర్కొన్నారు. తాను హైదరాబాద్‌కు లోయల్ ఫ్యాన్ అనీ రాశి సింగ్ వీడియోలో వెల్లడించారు
RCB fans Trolling Her for supporting SRH 🥲🥲 pic.twitter.com/iuEQKfVjeL
— Sailesh🔥 (@MeherRameshFan) April 29, 2024