రూ.10 నాణేలు చెల్లవంటే కుదరదు.. ఆర్బీఐ క్లారిటీ

చాలా మంది రూ.10 నాణెం ఇస్తే ఇది చెల్లదు.. రూ.10 నోటు ఉంటే ఇవ్వండని చెబుతుంటారు.

By Srikanth Gundamalla  Published on  7 Aug 2024 7:21 AM IST
rbi,  traders, citizens,  accept rs 10 coins,

రూ.10 నాణేలు చెల్లవంటే కుదరదు.. ఆర్బీఐ క్లారిటీ 

చాలా మంది రూ.10 నాణెం ఇస్తే ఇది చెల్లదు.. రూ.10 నోటు ఉంటే ఇవ్వండని చెబుతుంటారు. ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఉంటుంది. వాస్తవానికి ఇదంతా ప్రజలు వారు వారు సృష్టంచుకున్న అపోహ మాత్రమే. ఆర్బీఐ ఎప్పుడూ రూ.10 నాణెం చెల్లదు అని ప్రకటించలేదు. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశిస్తూ.. ప్రజలు, వ్యాపారులకు ముఖ్యమైన గమనికను జారీ చేసింది. నాణెల చెల్లవు అని ఆర్బీఐ ఎప్పుడూ చెప్పలేదని తెలిపింది. ఇకపై రూ.10 నాణెలు చెల్లవు అంటే కుదరదు అనీ.. ఏ డిజైన్, ఆకృతిలో ఉన్నా సరే అవి చెల్లుబాటు అవుతాయని పేర్కొంది. ఎవరూ రూ.10 నాణెనాన్ని తీసుకునేందుకు నిరకారకరించకూడదని పేర్కొంది. ఎవరైనా అలా చేస్తే చట్టప్రకారం శిక్షార్హులంటూ హెచ్చరించింది.

రూ.10 నాణెం తీసుకునేందుక తిరస్కరించడంతో పెద్ద ఎత్తున బ్యాంకుల్లో ఈ కాయిన్స్ పడి ఉంటున్నాయి. విజయవాడలోని ఓ బ్యాంకులో ఏకంగా రూ.12 లక్షల విలువైన రూ.10 నాణెలు పేరుకుపోయాయని తెలిసింది. ఇంత పెద్ద మొత్తంలో ఉన్న కాయిన్స్‌ను దాచలేక ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రూ.10 నాణేలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఆర్బీఐ విజయవాడలోని మెయిన్ బ్యాంకర్లు, వారి కస్టమర్లుగా ఉన్న ముఖ్యమైన రీటైల్ సంస్థల ప్రతినిధులతో విస్తృత సమావేశం నిర్వహిస్తోంది.

రిజర్వ్ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా రూ.10 నాణేలను 2009 మార్చి - 2017 జూన్‌ మధ్య 14 సందర్భాల్లో విడుదల చేసింది. ఈ కాయిన్స్ సందర్భాల్ని బట్టి వివిధ డిజైన్‌లతో ఉన్నాయి. రూ.10 నోట్లు ఎక్కువగా చేతులు మారుతుంటాయి. ఈ సందర్భాల్లో అవి త్వరగా పాడవుతుంటాయని చెబుతున్నారు. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఆర్బీఐ మిగతా నాణేలతోపాటు కొన్నేళ్లుగా రూ.పది నాణేలనూ ముద్రిస్తోంది. బ్యాంకులకు వచ్చే పాడైపోయిన నోట్లను చెస్ట్‌లలో జమ చేస్తుంటారు. అక్కడి నుంచి అవి ఆర్బీఐకి పంపుతుంటారు.. ప్రజల్లో అపోహల వల్ల చిరిగిన నోట్లతో పాటు రూ.పది నాణేలనూ కూడా బ్యాంకు చెస్ట్‌లో జమ చేయాల్సి వస్తోంది. గతంలో ఇప్పటికే ఆర్‌బీఐ ఇలాంటి ప్రకటన చేసినా ప్రజల్లో మార్పు రాలేదు. తాజాగా మరోసారి హెచ్చరించింది. మరి ఇక ముందేం చేస్తారో చూడాలి.

Next Story