ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం రోజురోజుకీ మహా ఉద్యమంలా కొనసాగుతుంది. ఈ ఛాలెంజ్‌ను స్వీకరించి మొక్కలు నాటడానికి పలువురు ప్రముఖులు ఉత్సాహం చూపుతున్నారు. ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు పలువురు సినీ ప్రముఖులు, క్రీడాకారులు, వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు ముందుకు వచ్చి మొక్కలు నాటడమే కాకుండా బాధ్యత తీసుకోని ఇతరుల చేత గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను పూర్తి చేయించడం జరుగుతుంది. తాజాగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా టాలీవుడ్ హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్ మొక్క‌లు నాటారు. అనంత‌రం ఆమె అక్కినేని నాగ చ‌త‌న్య‌ను నామినేట్ చేసింది.


సామ్రాట్

Next Story