ఏపీలో రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
By Srikanth Gundamalla Published on 7 April 2024 6:19 PM ISTఏపీలో రాజకీయాలపై ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర కామెంట్స్
ఆంధ్రప్రదేశ్‌లో లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గతేడాది డిసెంబర్‌లో పూర్తవగా.. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు.. తెలంగాణలో ఏ పార్టీ అధిక సీట్లను సాధిస్తుందనేది చర్చ కొనసాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలపై ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు .
ఆంధ్రప్రదేశ్‌లో సీఎం జగన్ తిరిగి అధికారంలోకి రావడం చాలా కష్టమని ప్రశాంత్ కిశోర్ అన్నారు. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్‌సీపీ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ పనిచేసిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల వ్యూహకర్తగా పనిచేశాడు. అప్పుడు వైసీపీ అధికారంలోకి వస్తుందని కచ్చితంగా చెప్పారు. ఇటీవల చంద్రబాబును కూడా కలిశారు ప్రశాంత్ కిశోర్. ఇక సీఎం జగన్ గురించి మాట్లాడుతూ.. చత్తీస్‌గఢ్ మాజీ సీఎంతో పోల్చారు. చత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ లాగే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి బదులు నియోజకవర్గాలకు ప్రొవైడర్ మోడ్‌లోనే జగన్ ఉండిపోయారని అన్నారు. ఒకప్పటి చక్రవర్తుల మాదిరిగా తాయిలాలతోనే సరిపెట్టడం తప్పితే ఇంకేమీ లేదన్నారు. ప్రజలకు నగదు బదిలీ చేశారు కానీ.. ఉద్యోగాలు కల్పించడం, రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చేలా ఏమీ చేయలేదని ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఈ మేరకు పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు.
ఇక జాతీయ స్థాయిలో బీజేపీ విజయావకాశాలపై కూడా ప్రశాంత్ కిశోర్ స్పందించారు. ప్రస్తుత ఎన్నికల్లో బిజెపి 370 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ ఆ మేరకు చేరుకోవడం బిజెపికి అసాధ్యమనే ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణలో లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ రెండో అతిపెద్ద పార్టీగా ఉందనీ.. ఒడిశాలో ప్రథమ స్థానంలో ఉందన్నారు. లోక్ సభ 543 సీట్లలో తెలంగాణ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బీహార్, కేరళల వాటా 204 సీట్లుగా ఉంది. ఈ రాష్ట్రాలలో బిజెపి 2014 నుంచి 2019 వరకు 50 సీట్లను కూడా దాట లేదు. 47 నియోజకవర్గాల్లో 29 మాత్రమే గెలిచింది.తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, ఒడిశా, వెస్ట్ బెంగాల్, బీహార్‌తో కలిపి మొత్తంగా 204 లోక్‌సభ స్థానాలు ఉంటే 2014 లేదా 2019లో బీజేపీ ఇక్కడ 50 సీట్లకు మించి ఎక్కువ సీట్లు సాధించలేదని గుర్తు చేశారు.