రోహిత్, విరాట్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో టీమిండియా అద్బుమైన ప్రదర్శనతో విన్నర్‌గా నిలిచింది.

By Srikanth Gundamalla  Published on  30 Jun 2024 6:45 AM GMT
pm modi, phone call, rohit, virat,  world cup,

 రోహిత్, విరాట్‌తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ 

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టోర్నీలో టీమిండియా అద్బుమైన ప్రదర్శనతో విన్నర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో టీమిండియా గెలిచి కప్‌ను సొంతం చేసుకుంది. భారత్ విజయంతో దేశ ప్రజలంతా సంబరాలు చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత రెండోసారి కప్‌ను గెలుచుకుంది భారత్. ఈక్రమంలో టీమిండియా ఆటగాళ్లకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ టీమ్‌ఇండియా ఆటగాళ్లకు స్వయంగా కాల్ చేసిన మాట్లాడారు. ఈ విషయాలను ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌ వేదికగా షేర్ చేసుకున్నారు.

భారత జట్టు ఆటగాళ్లతో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో వరుసగా పోస్టులు పెట్టారు. 'భారత జట్టుతో మాట్లాడి.. టీ20 వరల్డ్ కప్‌లో వారి ఆదర్శప్రాయమైన విజయాన్ని అభినందించాను. టోర్నీ అంతటా వారు అద్భుతమైన నైపుణ్యం, స్ఫూర్తిని ప్రదర్శించారు. ప్రతీ క్రీడాకారుని నిబద్ధత ప్రేరేపిస్తుంది' అని ఎక్స్‌లో మోదీ పోస్టు పెట్టారు.

ఇక రోహిత్‌తో మాట్లాడిన ప్రధాని.. 'మీ అద్భుతమైన వ్యక్తిత్వం.. మీ దూకుడు మనస్తత్వం, బ్యాటింగ్ కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని అందించాయి. మీ టీ20 కెరియర్‌ ఎంతో గుర్తుండిపోతుంది. ఇవాళ మీతో మాట్లాడినందుకు ఆనందంగా ఉంది' అని రోహిత్‌తో మాట్లాడిన తర్వాత మోదీ ఎక్స్‌లో పోస్టు పెట్టారు.

విరాట్‌ కోహ్లీతో సంభాషించిన మోదీ.. ఆయనతో మాట్లాడినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ఫైనల్‌లో విరాట్‌ కోహ్లీ ఇన్నింగ్స్‌ అద్భుతమన్నారు. కోహ్లీ భారత బ్యాటింగ్‌ను అద్భుతంగా ఎంకరజ్ చేశారనీ.. అన్ని ఫార్మాట్లలో మెరిశారని అన్నారు. టీ20 క్రికెట్‌ మిమ్మల్ని కోల్పతుందని.. కొత్త తరం ఆటగాళ్లను ప్రేరేపిస్తూనే ఉంటారంటూ విరాట్‌ కోహ్లీని ఉద్దేశించి మాట్లాడినట్లు ప్రదాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో వెల్లడించారు.

అలాగే కోచ్‌ రాహుల్ ద్రవిడ్‌ అద్బుతమైన కోచింగ్ ప్రయాణం భారత క్రికెట్‌ను విజయానికి తీసుకెళ్లిందన్నారు. ద్రవిడ్ అంకితభావం, వ్యూహాత్మక అంతర్‌దృష్టి, సరైన ప్రతిభను పెంపొందించడంలో జట్టును మార్చాయని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలకు గాను భారత్‌ మొత్తం ద్రవిడ్‌కు కృతజ్ఞతలు తెలుపుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. అతను వరల్డ్‌ కప్‌ను గెలవడంలో ముఖ్యపాత్ర పోషాంచారనీ.. ఆయన కు అభినందనలు తెలుపుతున్నట్లు ఎక్స్‌లో ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు.

Next Story