అన్నయ్య చిరుని కలిసి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 6 Jun 2024 6:54 PM ISTఅన్నయ్య చిరుని కలిసి ఆశీర్వాదం తీసుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన రికార్డు విజయాన్ని నమోదు చేసుకున్న విషయం తెలిసిందే. జనసేన అభ్యర్థులు పోటీ చేసిన వారంతా విజయాన్ని అందుకున్నారు. 21 అసెంబ్లీ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలవగా.. పోటీ చేసిన మరో రెండు లోక్‌సభ స్థానాల్లో కూడా గెలిచారు. ఇక ఘన విజయం తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రభుత్వంలో కూడా భాగం కాబోతున్నామని ఇప్పటికే చెప్పిన విషయం తెలిసిందే.
తాజాగా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని కలిసేందుకు ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి నివాసం వద్ద పవన్ కల్యాణ్‌కు ఘన స్వాగతం లభించింది. అప్పటికే అక్కడికి చేరుకున్న అభిమానులు పవన్‌కు వెల్‌కమ్ చెప్పారు. ఇక ఇంట్లోని కుటుంబ సభ్యులు కూడా పవన్‌కు సుస్వాగతం పలికారు. పూలమాలతో సత్కరించారు. మెగాస్టార్ చిరంజీవి వద్దకు వెళ్లిన పవన్ కల్యాణ్.. ఆయన్ని ఆలింగనం చేసుకుని పాదాభివందనం చేశారు. అన్నయ్య ఆశీర్వాదాలను పొందారు. ఆ తర్వాత వదిన పాదాలకు కూడా నమస్కరించారు పవన్ కల్యాన్. ఈ సందర్భంగా చిరంజీవితో పాటు.. కుటుంబ సభ్యులంతా భావోద్వేగం అయ్యారు. పదేళ్ల కష్టానికి తగ్గ ఫలితం తగ్గిందని ఆనందంలో మునిగి తేలుతున్నారు. ఇక పవన్ కల్యాణ్ చిరంజీవిని కలిసేందుకు వెళ్లి.. ఆశీర్వాదం తీసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాల తర్వాత అన్నయ్య చిరంజీవిని ఆయన నివాసంలో కలిసి ఆశీర్వాదం తీసుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ pic.twitter.com/cWzvaYD8ji
— Newsmeter Telugu (@NewsmeterTelugu) June 6, 2024