భార్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లారు.
By Srikanth Gundamalla
భార్య గ్రాడ్యుయేషన్ వేడుకకు హాజరైన డిప్యూటీ సీఎం పవన్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సింగపూర్ వెళ్లారు. అక్కడ ఆయన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తన భార్య గ్రాడ్యుయేషన్ పట్టా తీసుకుంటుండగా తిలకించారు. సింగపూర్‌లోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ ఆఫ్ ఆర్ట్స్ విభాగంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిగ్రీ పూర్తి చేశారు అన్నా లేజినోవా. తాజాగా ఆమె శనివారం డిగ్రీ పట్టా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తీన్‌మార్ అనే సినిమాలో పవన్ కళ్యాణ్, అన్నా లెజినోవా కలిసి నటించారు. ఈ సినిమా అనంతరం వీరి స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ అన్నా లెజినోవాను 2013లో వివాహం చేసుకున్నారు. వీరికి పొలినా, మార్క్ అని ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
Deputy CM @PawanKalyan,is in Singapore to attend the graduation ceremony of “Anna Konidela”. 😎 pic.twitter.com/AlITKWYrTQ
— S e e N u (@SrinivasFitness) July 20, 2024