నేడే శ్రీరామనవమి..ఆ నైవేద్యం పెడితే ఇబ్బందులు తొలగిపోతాయట
By Knakam Karthik
నేడే శ్రీరామనవమి..ఆ నైవేద్యం పెడితే ఇబ్బందులు తొలగిపోతాయట
దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీరామనవమి హిందూ సంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఈ రోజున దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, రామాయణ పారాయణాలు, భజనలు, రథయాత్రలు జరుగుతాయి. అయోధ్యలో రామ జన్మభూమి ఆలయంలో భక్తులు సరయూ నదిలో స్నానం చేసి, శ్రీరాముని దర్శనం చేసుకుంటారు. రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయంలో అభిషేకాలు, భక్తి కార్యక్రమాలు జరుగుతాయి. ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఈ పండుగకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. భద్రాచలం, ఒంటిమిట్ట వంటి ప్రాంతాల్లో శ్రీరాముని కళ్యాణం, పట్టాభిషేకం వంటి కార్యక్రమాలు భక్తులను ఆకర్షిస్తాయి.
శ్రీరామనవమి నేపథ్యంలో రామ భక్తులు రకరకాల నైవేద్యాలు తయారు చేస్తుంటారు. శ్రీరాముడికి ప్రీతిపాత్రమైన బెల్లం పానకం, వడపప్పు వంటి నైవేద్యాలు సమర్పిస్తుంటారు. అయితే.. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారు, ఇతర ఇబ్బందులతో బాధపడేవారు.. శ్రీరామనవమి రోజున ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తే.. అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఆ ఇతర నైవేద్యాలో ఏంటో తెలుసుకుందాం.
ఈ నైవేద్యాలు సమర్పిస్తే..
కొబ్బరిముక్కలను శ్రీరాముడికి నైవేద్యంగా పెట్టి అందరికీ పంచిపెడితే అధికారుల నుంచి వచ్చే ఇబ్బందులు తొలగిపోతాయి.
ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కుదరని వారు నవమి రోజు రామయ్యకు సపోటా పండ్లను నైవేద్యంగా పెట్టి వాటిని అందరికీ పంచాలి.
కమలాపండు ముక్కలను శ్రీరామచంద్రమూర్తికి నైవేద్యంగా పెడితే అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.
జామ పండును నైవేద్యంగా పెడితే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి, సఖ్యత పెరుగుతుంది.
పెద్దపెద్ద కష్టాలు, అనారోగ్య సమస్యలు ఉంటే పనస పండు ముక్కలను ప్రసాదంగా సమర్పించాలి