మళ్లీ టైటిట్‌ను ఎగరేసుకుపోయిన ముంబై ఇండియన్స్
Mumbai Indians Won IPL2020 Title. ఐపీఎల్-2020 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎగురేసుకుపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో
By Medi Samrat Published on 11 Nov 2020 4:19 AM GMTఐపీఎల్-2020 టైటిల్‌ను ముంబై ఇండియన్స్ ఎగురేసుకుపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్ పోరులో ముంబై ఇండియన్స్ 5 వికెట్ల తేడాతో గెలిచి టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఇది ముంబై ఇండియన్స్ కు వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ కాగా.. ఓవరాల్‌గా ఐదోది.
టాస్ గెలిచిన ఢిల్లీ ముందుగా బ్యాటింగ్ చేసి నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టానికి 156 పరుగులు చేసింది. రిషభ్ పంత్(56; 38 బంతుల్లో 4 ఫోర్లు, 2సిక్స్‌లు), శ్రేయస్ అయ్యర్(65 నాటౌట్; 50 బంతుల్లో 6 ఫోర్లు, 2సిక్స్‌లు)లు రాణించారు. ఢిల్లీ ఇన్నింగ్స్‌ను ధావన్-స్టోయినిస్‌లు ఆరంభించారు. తొలి ఓవర్‌లో బౌల్ట్ వేసిన తొలి బంతికే స్టోయినిస్ పెవిలియన్‌కు చేరాడు. అనంతరం మరో రెండు వికెట్లు కూడా పడటంతో 22 పరుగులకే మూడు వికెట్లు కోల్పోవడంతో ఢిల్లీ జట్టు కష్టాల్లో పడింది. ఆ తరుణంలో అయ్యర్-పంత్‌లు ఇన్నింగ్స్‌ను మరమ్మత్తులు చేశారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ మూడు వికెట్లు సాధించగా.. కౌల్టర్ నైల్ రెండు వికెట్లు.. జయంత్ యాదవ్‌కు వికెట్ దక్కింది.
ఇక ఢిల్లీ నిర్దేశించిన 157 పరుగుల టార్గెట్‌ను ముంబై 18.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. రోహిత్ శర్మ(68; 51 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లు) కెప్టెన్ ఇన్నింగ్సు ఆడగా.. ఇషాన్ కిషన్( 33 నాటౌట్; 19 బంతుల్లో 3 ఫోర్లు, 1సిక్స్) ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. డీకాక్(20; 12 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), సూర్యకుమార్(19; 20 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్)లు రాణించారు. ఢిల్లీ బౌలర్లలో నొకియాకు రెండు, రబడాకు ఒకటి, స్టోయినిస్‌కు ఒక వికెట్ లభించింది.