నొప్పించినందుకు విచారిస్తున్నా : ఎంఎల్సీ పట్నం మహేందర్ రెడ్డి
By - Nellutla Kavitha | Published on 28 April 2022 6:05 PM IST
వికారాబాదా జిల్లా తాండూర్ సీఐని టీఆరెస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తిట్టిన విషయంపై పోలీస్ సంఘాలు మండిపడ్డాయి. ఈ సంఘటనకు చెందిన ఆడియో క్లిప్పులు వైరల్ గా మారడంతో స్పందించారు మహేందర్ రెడ్డి. తాను పోలీసుల మనస్సు నొప్పిస్తే తనకు బాధకరంగా ఉంటుందని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు.
గురువారం విడుదల చేసిన ఓ ప్రకటనలో పోలీసు సోదరులంతా తన కుటుంబ సభ్యులతో సమానమని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి, అభివృద్ధి, శాంతిభద్రతలలో వారి కృషి అభినందనీయమని అన్నారు. నిన్నటి నుండి విస్తృతంగా ప్రచారం అవుతున్న ఆడియో క్లిప్పుల్లో ఆవేశంగా మాట్లాడి, పొరపాటున నోరుజారిన నేపథ్యంలో కొంత మంది మిత్రులు, పోలీసులు భాధపడితే తాను తీవ్రంగా విచారం వ్యక్తం చేస్తున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. పోలీసులంటే తనకు ఎనలేని గౌరవం అని అన్నారు ఎమ్మెల్సీ.
Next Story