జైల్లో వసతులు కల్పించడం లేదని కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.
By Srikanth Gundamalla Published on 29 March 2024 9:41 AM ISTజైల్లో వసతులు కల్పించడం లేదని కోర్టుకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈడీ కస్టడీ పలుమార్లు పొడిగించిన తర్వాత.. ఇటీవల కవితకు రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. దాంతో.. ఈడీ అధికారులు ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలులోనే ఉన్నారు.
కాగా.. జైలులో తనకు కొన్ని వసతులు కల్పించాలని రౌస్ అవెన్యూ సీబీఐ కోర్టుకు ఎమ్మెల్సీ కవిత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. దాంతో.. స్పందించిన న్యాయస్థానం కూడా అందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కవిత విజ్ఞప్తి మేరకు సొంతంగా భోజనం ఏర్పాటు చేసుకోవడం, రోజూవారీ ఉపయోగించే దుస్తులు తీసుకోవడం, కొన్ని ఆభరణాలు ధరించడంతో పాటు సొంతంగా పరుపులు ఏర్పాటు చేసుకోవడం, దుప్పట్లు తెచ్చుకోవడం, చెప్పులు వేసుకోవడం వంటి వెసులుబాట్లు కల్పించింది కోర్టు. తీహార్ జైలుకు తరలించకముందే కవితకు ప్రత్యేక కోర్టు ఈ వెసులుబాట్లు కల్పించించింది.
అయితే..ఈ వసతులను తీహార్ జైలు అధికారులు కల్పించడం లేదని ఎమ్మెల్సీ కవిత తరఫు న్యాయవాదులు ప్రత్యేక కోర్టుకు ఫిర్యాదు చేశారు. కనసీం రోజువారీ ఉపయోగించే దుస్తులను కూడా అనుమతి ఇవ్వడం లేదని చెప్పారు. రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరి భవేజా దీన్ని పరిశీలించారు. దాంతో.. స్పందించిన న్యాయస్థానం జైలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ముందే ఉత్తర్వులు ఇచ్చిందనీ.. కానీ ఎందుకు వాటిని అమలు చేయడం లేదో చెప్పాలని ఆదేశించింది. శుక్రవారం సమాధానం ఇవ్వాలని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఆదేశాల్లో పేర్కొంది.