Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది.

By Srikanth Gundamalla  Published on  4 Jan 2024 5:08 PM IST
mlc, election, notification,  telangana,

Telangana: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ 

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు గురువారం నోటికేషన్ విడుదల చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీలుగా ఉన్న కడియం శ్రీహరి, పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు. అయితే.. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత వారి ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేశారు. దాంతో..ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యాయి. వాటిని భర్తీ చేసేందుకు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను విడుదల చేసింది.

తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు కడియం, పాడి కౌశిక్‌ రెడ్డి డిసెంబర్ 9న రాజీనామా చేశారు. తెలంగాణలో రెండు స్థానాలతో పాటు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మరో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ మేరకు ఈ మూడు స్థానాలకు జనవరి 11న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుంది. అదే రోజు నుంచి ఎమ్మెల్సీ స్థానా లకోసం నామినేషన్లు స్వీకరిస్తారు ఎన్నికల సంఘం అధికారులు. 18వ తేదీన నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత జనవరి 19వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జనవరి 22వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు సమయం ఉంటుంది. ఆ తర్వాత జనవరి 29న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్యేల ద్వారా పోలింగ్ నిర్వహిస్తారు. ఆ తర్వాత ఫిబ్రవరి 1న ఫలితాలు వెల్లడిస్తారని కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో పేర్కొంది.


Next Story